ప్రేమించే పెళ్లాడుతాను హీరోయిన్ రాశి ఖన్నా

అవును మీరు చదివింది నిజమే. ఊహలు గుసాగుసలాడే చిత్రంతో తెలుగు తెరకు పరిచయమై, క్యూట్ ఎస్ప్రెషన్స్ తో అభిమానులకు దగ్గరైంది రాశిఖన్నా. రీసెంట్ గా విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్ మూవీతో అభిమానులను పలకరించింది ఈ భామ.

సినిమా ఫలితంతో సంబంధం లేకుండా ఇప్పటివరకు తను పోషించిన ఏ పాత్ర పట్ల తనకు తక్కువ భావం లేదంటుంది రాశి. ఇక లాక్ డౌన్ కారణంగా ఇండ్లకే పరిమితమైన సెలబ్రిటీలు సోషల్ మీడియాకు అంకితమైపోతున్నారు. అందులో రాశి మరి చురుకు. ఇటీవల నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు రాశిఖన్నా సమాధానమిచ్చింది. అందులో ఓ నెటిజన్ పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చి లవ్ మ్యారేజ్ చేసుకుంటావా, పెద్దలు కుదిర్చిన మ్యారేజ్ చేసుకుంటావా అని అడగగా లవ్ మ్యారేజ్ కే తన ఓటంటూ నెటిజన్లకి షాక్ ఇచ్చింది. ఇక తెలుగులో త‌న అభిమాన క‌థానాయిక స‌మంతేనని రాశీఖ‌న్నా తెలిపింది. థియేట‌ర్లో తాను చూసిన తొలి సినిమా టైటానిక్ అని చెప్పింది. మ‌హేశ్‌బాబు, అల్లు అర్జున్‌ల‌తో సినిమాలు చేసేందుకు ఎదురుచూస్తున్నట్లు చెప్పుకొచ్చింది రాశిఖన్నా. చూద్దాం రాశి ఖన్నా కలలు నిజం కావాలని మనము కోరుకుందాం.