మయన్మార్ స్టేట్ కౌన్స్ లర్ దావ్ ఆంగ్ సాన్ సూ PM మోదీ టెలిఫోన్

మయన్మార్ యొక్క స్టేట్ కౌన్స్ లర్ దావ్ ఆంగ్ సాన్ సూకీతో ప్ర‌ధాన‌ మంత్రి న‌రేంద్ర మోదీ టెలిఫోన్‌ లో మాట్లాడారు. ఉభయ నేతలు వారి వారి దేశాలలో మరియు ప్రాంతీయ స్థాయిలో కోవిడ్-19 మ‌హ‌మ్మారి కారణంగా తలెత్తిన ప‌రిస్థితులను గురించి చర్చించారు. ఈ ప్రపంచవ్యాప్త వ్యాధి యొక్క వ్యాప్తి ని నియంత్రించడం కోసం తీసుకొంటున్న తాజా చర్యలను ఈ సందర్భంలో ఒకరి దృష్టికి మరొకరు తీసుకువచ్చారు.భారతదేశం అవలంబిస్తున్న ‘నేబర్ హుడ్ ఫస్ట్ పాలిసి’లో ఒక అత్యంత మహత్వపూర్ణ స్తంభం రూపంలో మయన్మార్ పోషిస్తున్నటువంటి పాత్ర ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రస్తావిస్తూ, ఆరోగ్యం మరియు ఆర్థిక రంగాలపై కోవిడ్-19 యొక్క ప్రభావాన్ని తగ్గించడంలో మయన్మార్ కు వీలయిన అన్ని విధాలుగా సహాయాన్ని అందించడానికి భారతదేశం సిద్ధంగా ఉందని తెలిపారు.

భారతదేశంలో ఉంటున్న మయన్మార్ పౌరులకు భారత ప్రభుత్వం పక్షాన సాధ్యమైన అన్ని విధాలు గాను మద్దతును ఇవ్వగలమంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హామీని ఇచ్చారు. అంతేకాక, మయన్మార్ లోని భారతీయ పౌరులకు మయన్మార్ అధికార వర్గం అందిస్తున్న సహకారానికి స్టేట్ కౌన్స్ లర్ కు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

కోవిడ్-19తో ఎదురవుతున్న వర్తమాన సవాళ్లు మరియు భవిష్యత్తు కాలంలో కూడా ఆ విశ్వ మహామ్మారి కారణంగా సవాళ్లను పరిష్కరించుకోవడం కోసం ఇరు పక్షాలు కలసికట్టుగా కృషి చేయాలని, పరస్పరం సంప్రదింపులు జరుపుకొంటూ ఉండాలన్న అంశాలలో ఇద్దరు నేతలు సమ్మతిని వ్యక్తం చేశారు.