షూటింగు పూర్తిచేసుకున్న ‘టక్ జగదీష్’

షూటింగు పూర్తిచేసుకున్న ‘టక్ జగదీష్’

రవితేజ తరువాత ఏడాదికి తక్కువలో తక్కువ తన సినిమాలు మూడైనా థియేటర్లకు వెళ్లాలనే దిశగా నాని ప్లాన్ చేసుకుంటూ ఉంటాడు. అలాగే ఈ ఏడాది కూడా ఆయన ‘టక్ జగదీష్’ .. ‘శ్యామ్ సింగ రాయ్’ .. ‘ అంటే .. సుందరినికీ!’ సినిమాలను లైన్లో పెట్టేశాడు. అనుకున్న సమయానికి శివ నిర్వాణ దర్శకత్వంలో ‘టక్ జగదీష్’ సినిమాను పూర్తిచేశాడు. ఈ నెల 23వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలనుకున్నారు. కానీ కరోనా ఉధృతి ఎక్కువగా ఉన్న కారణంగా కుదరలేదు. త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటించనున్నారు.ఇక తరువాత నాని ఒప్పుకున్న ‘శ్యామ్ సింగ రాయ్’ .. ‘ అంటే .. సుందరానికీ!’ రెండు ప్రాజెక్టులు కూడా సెట్స్ పైనే ఉన్నాయి. కరోనా కారణంగా చాలా సినిమాలు పేకప్ చెప్పేసుకుని లొకేషన్లు వదిలేసి వెళ్లిపోయాయి. కానీ నాని మాత్రం ఈ రెండు సినిమాల షూటింగ్స్ లో పాల్గొంటూ ఉండటం విశేషం. అటు కొన్ని రోజులు .. ఇటు కొన్ని రోజులు కేటాయిస్తూ రెండు షూటింగులు కానిచ్చేస్తున్నాడట. అయితే తాను చాలా జాగ్రత్తలు తీసుకుంటూ .. టీమ్ ను అప్రమత్తం చేస్తున్నాడని అంటున్నారు. కరోనా పరిస్థితుల్లోను నాని గ్యాప్ లేకుండా తన పని తాను చేసుకుంటూ వెళుతుండటం విశేషమే.