USAకు ఇండియా సహాయం – హైడ్రోక్సిక్లొరోక్విన్‌ డ్రగ్ పవర్

అగ్రరాజ్యం అమెరికా కరోనా వైరస్‌ను ఎదుర్కొనడానికి మనదేశ సహాయాన్ని కోరింది. భారతదేశం హైడ్రోక్సిక్లొరోక్విన్‌
సరఫరా చేయాలంటూ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మన ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేసారు. మలేరియా సోకిన వారికి అందించే వైద్య చికిత్సలో వినియోగించే హైడ్రోక్సిక్లొరోక్విన్‌ డ్రగ్‌ను కరోనా వైరస్ సోకిన పేషెంట్ల వైద్య చికిత్సలో వినియోగించాల్సి ఉంటుందన్నారు. ఈ డ్రగ్ చాలినంతగా అందుబాటులో లేకపోవడంతో అమెరికా ఇబ్బందులను ఎదుర్కొంటోంది. అందుకే సత్వరమే సరఫరా చేయాలని
డోనాల్డ్ ట్రంప్ కోరారు. యాంటీ మలేరియన్ డ్రగ్ హైడ్రొక్సిక్లొరోక్విన్ అవసరాలు భారత్‌కు కూడా ఉంటాయని అయినప్పటికీ USAకు ఆ మందుల అవసరాలకు సరఫరా కావాలన్నారు.