ఢిల్లీలో లాక్ డౌన్2 ఎలా ఉందో??

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా లాక్ డౌన్2 కట్టుదిట్ఠంగా అమలు అవుతోంది. మెట్రో నగరాల్లో సామాజిక దూరం పాటించాలన్న అవగాహనతో ప్రజలు సహకరిస్తున్నారు. దీంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉండటం, పోలీసులు ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే దేశంలోనే ఢిల్లీలో అత్యధికంగా 1893 కరోనా కేసులు నమోదు అవడంతో రెండవ స్థానంలో ఉండటం ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో లాక్ డౌన్2 కారణంగా రోడ్లు ఎలా ఉన్నాయో మీరే చూడండి.