భారతీయుల రక్షణే లక్ష్యంగా నేవీ

ఐఎన్‌ఎస్‌ జలాస్వా మాలే పోర్టుకు చేరుకుంది. కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఇతర దేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు భారత ప్రభుత్వం భారీ తరలింపు కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో భాగంగా ఇండియన్‌ నేవీ సముద్ర సేతను చేపట్టింది. ఫేజ్‌-1 ఆపరేషన్‌లో భాగంగా మాల్దీవుల్లో చిక్కుకున్న భారతీయులను తీసుకువచ్చేందుకు ఐఎన్‌ఎస్‌ జలాస్వా బయల్దేరి వెళ్లింది.

నేడు మాలే పోర్టుకు చేరుకుంది. వెయ్యి మంది ప్రయాణికులతో రేపు తిరిగి భారత్‌కు ప్రయాణం కానుంది. వైద్య పరీక్షల నిర్వహణ అనంతరం మాత్రమే వీరిని షిప్‌ ప్రయాణానికి అనుమతించనున్నారు. భారత్‌కు తిరిగి వచ్చిన తర్వాత సైతం క్వారంటైన్‌కు పంపనున్నారు.