NO చైనా- YES ఐఐసిటి-ల‌క్సాయ్ లైఫ్‌సైన్సెస్

దేశంలో ఔష‌ధాల ఉత్ప‌త్తి ప‌రిమాణం రీత్యా, ప్ర‌పంచంలోనే మూడ‌వ‌ అతిపెద్దదిగా ఉన్న‌ భార‌తీయ ఔష‌ధ ప‌రిశ్ర‌మ‌, చైనా ముడి ప‌దార్థాల‌పై ఎక్కువ‌గా ఆధార‌ప‌డుతుండ‌డాన్ని కోవిడ్ 19 ప‌రిణామాలు బ‌హిర్గ‌తం చేశాయి. ముడి స‌ర‌కు స‌ర‌ఫ‌రాలో జాప్యం, ధ‌ర‌ల పెంపు కార‌ణంగా భార‌తీయ ఫార్మా ప‌రిశ్ర‌మ ముడిప‌దార్థాల స‌ర‌ఫ‌రాలో కొర‌త‌ను ఎదుర్కొంటున్న‌ది. దీనిని గుర్తించి, ఔష‌ధ భ‌ద్ర‌త‌, ప్ర‌జారోగ్యానికి అత్య‌వ‌స‌ర మందుల అందుబాటు కీల‌క‌మ‌ని గుర్తించి ప్ర‌ధాన‌మంత్రిశ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న స‌మావేశ‌మైన కేంద్ర కేబినెట్ , భార‌త‌దేశంలో బ‌ల్క్ డ్ర‌గ్ త‌యారీని ప్రోత్స‌హించేందుకు త‌ద్వారా చైనా పై ఆధార‌ప‌డ‌డాన్ని త‌గ్గించేందుకు ఒక ప్యాకేజ్‌ని ఆమోదించారు.

ప‌రిశ్ర‌మ వ‌ర్గాలు, భార‌త ప్ర‌భుత్వం తీసుకుంటున్న చ‌ర్య‌ల‌కు అనుగుణంగా, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండ‌స్ట్రియ‌ల్ ‌రీసెర్చ్ (సిఎస్ఐఆర్‌) కు చెందిన హైద‌రాబాద్ లోని ఇన్‌‌స్టిట్యూట్ ఆఫ్ కెమిక‌ల్ టెక్నాల‌జీ (ఐఐసిటి) , హైద‌రాబాద్‌కు చెందిన స‌మీకృత ఔష‌ధ త‌యారీ కంపెనీ ల‌క్సాయ్ లైఫ్ సైన్సెస్‌తో క‌లిసి సంయుక్తంగా క్రియాశీల ఔష‌ధ త‌యారీ ప‌దార్థాలు( యాక్టివ్ ఫార్మాసూటిక‌ల్ ఇంగ్రీడియెంట్స్‌), ఇంట‌ర్మీడియేట్‌ల‌ను భార‌తీయ ఔష‌ధ త‌యారీ ప‌రిశ్ర‌మ‌కోసం ఉత్ప‌త్తి చేస్తాయి. దీనితో చైనా దిగుమ‌తుల‌పై ఆధార‌ప‌డ‌డం త‌గ్గుతుంది.

ల‌క్సాయ్ లైఫ్‌సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ ను 2007 లో ఏర్పాటు చేశారు. అంత‌ర్జాతీయ ఫార్మాసూటిక‌ల్ కంపెనీల డిస్క‌వ‌రీ కెమిస్ట్రీ ప్రచారాన్ని వేగ‌వంతం చేసే దార్శ‌నిక‌త‌తో దీనిని ఏర్పాటు చేశారు. ఇవాళ ల‌క్సాయ్ స‌మీకృత ఫార్మా కంపెనీగా ఎదిగి, ఎపిఐ, ఫార్ములేష‌న్ల అభివృద్ధి, ఎపిఐఎ తయారీరంగంలో ప‌నిచేస్తోంది. ల‌క్సాయ్ కు త‌న స‌బ్సిడ‌రీ థెరాపివా ద్వారా యుఎస్ఎఫ్‌డిఎ, జిఎంపి త‌యారీ స‌దుపాయాలు అందుబాటులో ఉన్నాయి.

క‌రోనా వైరస్‌కు వ్యతిరేకంగా పోరాటంలో వాడుతున్న ఔష‌ధాల‌ సంశ్లేషణ కోసం ఐఐసిటి, ల‌క్సాయ్‌ తో కలిసి పనిచేస్తోంది. ఈ సంస్థ‌లు ప్రధానంగా యుమిఫెనోవిర్, రెమ్‌డెసివిర్ , హైడ్రాక్సీ క్లోరోక్విన్ (హెచ్‌సిక్యూ) కీ ఇంటర్మీడియట్ పై దృష్టి పెడతాయి.. మ‌లేరియా పై పోరాటానికి వాడే హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను ఉత్ప‌త్తి చేసే అతిపెద్ద దేశాల‌లో భార‌త్ ఒక‌టి. ఇటీవ‌లి కాలంలో దీని డిమాండ్ బాగా పెరిగింది. గ‌త కొద్ది రోజుల‌లో అమెరికాతో స‌హా 50 దేశాల‌కు భార‌త‌దేశం హైడ్రాక్సి క్లోరోక్విన్ ను పంపింది.

ఈ కొలాబ‌రేష‌న్ , చైనాపై నామ‌మాత్రంగా ఆధార‌ప‌డే రీతిలో కీల‌క ముడి ప‌దార్థాల‌ను చౌక‌గా త‌యారు చేసే ప్ర‌క్రియ‌కు దోహ‌ద‌ప‌డుతుంది. దీనికితోడు గ‌తంలో ఎబోలో వైర‌స్ పేషెంట్ల‌కువాడిన రెమ్‌డెసివిర్ కోవిడ్ -19 పై పోరాటంలో, దాని స‌మ‌ర్థ‌త‌,భ‌ద్ర‌త‌పై క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ జ‌రుగుతున్నాయి.

ఈ సహకారం ఔష‌ధ ఉత్పత్తుల వాణిజ్య తయారీ ప‌రిజ్ఞానాన్ని ఉపయోగిస్తుంది. ఈ ఉత్పత్తులను వాణిజ్య‌ప‌రంగా త‌యారు చేసే మొదటి కొన్నింటిలో లాక్సాయ్ లైఫ్ సైన్సెస్ ఒకటి కానుంది. ఈ ఎపిఐ ల,ఇంట‌ర్‌మీడియేట్ ల‌ తయారీ ని లక్సాయ్ స‌బ్సిడ‌రీ అయిన థెరాపివా ప్రైవేట్ లిమిటెడ్ కి గ‌ల యుఎస్ఎఫ్‌డిఎ, జిఎంపి ఆమోదించిన ప్లాంట్లలో చేప‌ట్ట‌డం జ‌రుగుతుంది.