ఏపీ ఎలక్షన్ కమిషనర్ గా బాధ్యతలు తీసుకున్న నీలం సాహ్నీ

ఏపీ ఎలక్షన్ కమిషనర్ గా బాధ్యతలు తీసుకున్న నీలం సాహ్నీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్ఈసీ (స్టేట్ ఎలక్షన్ కమిషనర్)గా మాజీ సీఎస్, ఐఏఎస్ అధికారిణి నీలం సాహ్నీ, ఈ ఉదయం బాధ్యతలు స్వీకరించారు. నిన్నటితో నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పదవీకాలం పూర్తికాగా, అంతకుముందే నీలం సాహ్నీ నియామకాన్ని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఖరారు చేసిన సంగతి తెలిసిందే.నీలం సాహ్నీ బాధ్యతలు స్వీకరించిన తరువాత కమిషన్ కార్యదర్శి కన్నబాబుతో పాటు ఇతర ఉన్నతాధికారులు పుష్పగుచ్ఛాలిచ్చి ఆమెను అభినందించారు. రాష్ట్రానికి కొత్త ఎన్నికల కమిషనర్ గా ప్రభుత్వం ముగ్గురి పేర్లను సిఫార్సు చేయగా, వాటిని పరిశీలించిన గవర్నర్, సాహ్నీ నియామకాన్ని ఆమోదించారు.