NEET, JEE పరీక్షల తేదీలు ఖరారు

దేశంలోని మెడికల్ కాలేజీలు, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటి) ప్రవేశ పరీక్షల తేదీలను కేంద్ర హెచ్‌ఆర్‌డి మంత్రిత్వ శాఖ మంగళవారం ప్రకటించింది. మెడికల్ కాలేజీలకు నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్ (NEET) జూలై 26న, ఐఐటిల వంటి ప్రధాన సంస్థలకు జాయింట్ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ (జెఇఇ) మెయిన్స్ పరీక్ష జూలై 18 నుంచి 23 మధ్య జరుగుతుంది.

జెఇఇ-అడ్వాన్స్‌డ్ ఆగస్టు నెలలో జరుగుతుందని, ఖచ్చితమైన తేదీలను త్వరలో ప్రకటించనున్నట్లు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖా మంత్రి రమేష్ పోఖ్రియాల్ మీడియాకు తెలిపారు.