నిర్లక్ష్యం ఖరీదు ప్రాణాలే.. కర్నూలు ఫోటోలు మీకోసం

కర్నూలు నగరంలో ప్రజలు సామాజిక దూరం పాటించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఓ వైపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించి అత్యవసరాలు ఉంటేనే బయటకు రావాలని హెచ్చరిస్తున్నారు. ఎమర్జెన్సీ రోజులని ప్రజలందరికీ దండాలు, క్షమాపణలు చెబుతూ బతిమాలుకుంటున్నారు. అయినప్పటికీ నిర్లక్ష్యం ఎటుచూసినా నిర్లక్ష్యం, దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసులు వెయ్యి దాటేశాయి. ప్రజలు మాత్రం తీవ్రతను గుర్తించడం లేదు, బాధ్యతగా వ్యవహరించడం లేదు, ఇష్టారాజ్యంగా వీధుల్లో తిరుగుతున్నారు. గుంపులుగా ఉండరాదని అవగాహన అవగాహన కల్పిస్తున్నప్పటికి కర్నూలు సిటీలోని సీ క్యాంప్‌ ఏరియాలోన్న రైతుబజార్‌ ప్రాంతంలో జాతరలా జనం గుమికూడిన ఫోటోలు చూడండి. భారతీయుల్లారా మీ నిర్లక్ష్యం ఖరీదు మీ ప్రాణాలు మాత్రమే కాదు ఆలోచించండి.