ఆర్యవైశ్య మహసభ కొత్త భవనంకు టీజీ భరత్ 50 లక్షలు విరాళం

ఆర్యవైశ్య మహసభ కొత్త భవనంకు టీజీ భరత్ 50 లక్షలు విరాళం

నిరంతరం ఆర్యవైశ్యుల అభ్యునతికి పాటుపడే ఆర్యవైశ్యమహసభ ఆంధ్ర, తెలంగాణ విభజన జరిగిన తర్వాత సంస్థ కార్యకాలపాలు విజయవాడ నుండి
జరుగుతున్నాయి. దీనికోసం విజయవాడలో ఈ సంస్థకు శాశ్వత కార్యాలయం లేనందుకు ఆర్యవైశ్య మహసభ సంస్థ
చైర్మన్ (రాజ్యసభ సభ్యులు) టీజీ వేంకటేశ్ భవనం కొనుగోలు కోసం తన వంతుగా 50 లక్షలు విరాళం ప్రకటించారు. టీజీ వేంకటేశ్ ఆదేశాలతో మహసభ అధ్యక్షులు పెనుగోండ సుబ్బారాయుడు చొరవ తీసుకోని విజయవాడ నడిబొడ్డున గాందీనగరులో దాదాపు 700 గజాల భవనం
7 కోట్ల రూపాయలకు కోనుగోలు చేయడం జరిగింది.
మార్చి17 మంగళవారం యువ నాయుకులు టీజి భరత్ 50లక్షల చెక్కును ఆర్యవైశ్య మహసభ ప్రధాన కార్యదర్శి యిల్లూరు లక్ష్శయ్య అందజేశారు. ఈ కార్యక్రమంలో యిల్లూరు సుధాకర్, TS విజయకుమార్, యిల్లూరు
తిరుపాల్ బాబు, జగదిశ్ గుప్తా, శేషగిరి, విఠల్ పాల్గోన్నారు.