APలో కొత్త ఇసుక పాలసీ…

ఆంధ్రప్రదేశ్ సర్కారు నూతన ఇసుక పాలసీని మరింత పటిష్టంగా అమలు చేసేందుకు కీలక నిర్ణయం తీసుకుందని రాష్ట్ర భూగర్భ గనులశాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు.

రాష్ట్రంలోని పదమూడు జిల్లాలకు ఇసుక పర్యవేక్షణాధికారులు (డీఎస్ఓ)గా మైనింగ్ అధికారులు, ఇప్పటి వరకూ ఈ బాధ్యతలను అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు పర్యవేక్షించారు. ఇసుక పాలసీలో పారదర్శకతను మరింత పెంచడానికి కీలకమైన ఈ స్థానాల్లో పూర్తి స్థాయి మైనింగ్ అధికారుల నియామకం చేసారు. ఎడి, డిడి స్థాయి అధికారుల నియామకంతో జవాబుదారీతనం పెరుగుతుందని భావించిన ప్రభుత్వం, ఎపిఎండిసి, మైనింగ్ శాఖల మధ్య సమన్వయంతో ఇసుక విక్రయాల్లో వినియోగదారులకు మెరుగైన సేవలు అందిస్తారు. ఇసుక మైనింగ్, రవాణా, విక్రయాల్లో అక్రమాలకు అవకాశం లేకుండా పక్కా ప్రణాళికలు జగన్మోహన్ రెడ్డి సర్కారు సిద్ధం చేసింది.