క‌రోనా సినిమా క‌ష్టాలు.. 2021లో ఆ న‌లుగురు హీరోల సినిమాలు

దేశంలో క‌రోనా వైర‌స్‌(కోవిడ్‌-19)తో వివిధ రంగాలు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. దీంతో చాలా మంది జీవ‌నోపాధి కొల్పోయి అన్న‌మో రామ‌చంద్రా..! అనే ప‌రిస్థితి నెల‌కొంది. దీంతో ఆయా రంగాల్లో ప‌ని చేస్తున్న కార్మికులు, వల‌స‌కూలీలు, ప్రైవేటు రంగంలో ఉన్న ఉద్యోగులు అర్ధాక‌లితో అల‌మ‌టిస్తున్నారు. అయితే క‌రోనా కార‌ణంగా హాలువుడ్‌, టాలీవుడ్ కు చెందిన ప‌లు సినిమాల షెడ్యూల్స్ అల్లోక‌ల్లోలంగా మారిన విష‌యం తెలిసిందే. దీంతో ఈ సంవ‌త్స‌రం వ‌చ్చే జూన్‌, జూలైలో విడుద‌ల కావాల్సిన సినిమాల విష‌యంలో క్లారిటీ లేదు. మ‌రోవైపు ఇప్ప‌ట్లో నిలిచిపోయిన సినిమాల‌కు చెందిన షూటింగ్స్ ఇప్ప‌ట్లో జ‌రిగే దాఖ‌లాలు క‌నిపించ‌డం లేదు. అయితే ఊర‌ట క‌లిగించే విష‌యం ఏమిటంటే ప‌రిస్థితిలో మార్పులు వ‌స్తే వ‌చ్చే మే నెల‌లో మ‌ళ్లీ షూటింగ్‌లు ప్రారంభం అయ్యే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. దీంతో ప‌లు సినిమాల విడుద‌ల తేదీలు కూడా మార‌నున్నాయి. అయితే ఎన్ని సినిమాల తేదీలు మారినా కూడా విచ్చే సంక్రాంతికి వ‌స్తామంటూ ప్ర‌క‌టించిన జ‌క్క‌న్న మాత్రం అదే తేదీకి రాబోతున్న‌ట్లు స‌మాచారం.

RRR జనవరి లో
సంక్రాంతి సీజన్ కు కనీసం రెండు మూడు పెద్ద హీరోల సినిమాలు రానున్నాయి. వ‌చ్చే 2021, జ‌న‌వ‌రి 8న‌ ఆర్ ఆర్ ఆర్ రాబోతున్న‌ట్లు తెలుస్తోంది. మొత్తం సీజన్ ను ఆ సినిమాకే వదిలేసే అవకాశం ఉంది. వస్తే ఒకటి రెండు చిన్నా చితకా సినిమాలు రావచ్చు సినీ వ‌ర్గాలు భావిస్తున్నాయి. సంక్రాంతి సీజన్ తర్వాత వచ్చే ఏడాది సమ్మర్ ఆరంభంలో బడా హీరోల సినిమాలు వస్తాయని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తుండ‌టం గ‌మ‌నార్హం.

2021 ఏప్రిల్‌లో సినిమాలు:
వ‌చ్చే సంవ‌త్స‌రం ఏప్రిల్‌లో మ‌రికొన్ని సినిమాలు విడుద‌ల అవుతాయ‌ని స‌మాచారం. ఇందులో భాగంగానే సమ్మర్ ఆరంభం అయిన 2021 ఏప్రిల్ నెలపై ఏకంగా నలుగురు స్టార్ హీరోలు కన్నేసినట్లుగా తెలుస్తోంది. మహేష్ బాబు తన 27వ చిత్రాన్ని ఇంకా బన్నీ సుకుమార్ ల కాంబోలో తెరకెక్కబోతున్న ‘పుష్ప’ చిత్రాలతో పాటు పవన్ కళ్యాణ్ 27 లేదా 28 చిత్రాల్లో ఏదో ఒకటి ఏప్రిల్ లో విడుదల కాబోతుంది. ఇక ముందే ప్రకటించిన విధంగా ఎన్టీఆర్ త్రివిక్రమ్ ల కాంబోలో రూపొందబోతున్న సినిమా కూడా వచ్చే ఏడాది ఏప్రిల్ లోనే విడుదల కాబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ నలుగురు హీరోలు కూడా ఏప్రిల్ 2021పై దృష్టి పెట్టారు. పరిస్థితుల ప్రభావం వల్ల తేదీలు ఏమైనా మారుతాయో చూడాలి. ఈ నలుగురిలో కనీసం ఇద్దరు లేదా ముగ్గురు అయినా ఏప్రిల్ లో మాత్రం ఖచ్చితంగా వచ్చే అవకాశాలు ఉన్నాయని సినిమా విశ్లేషకులు అంచ‌నా వేస్తున్నారు.