NIMSలో వెంటిలేటర్లకు MEIL ₹41.95లక్షలు విరాళం

వైద్యో నారాయణో హరి, ప్రత్యక్ష దేవుళ్లు మన వైద్యులు.
వైద్య సేవ వృత్తి అలాంటిది. అందుకే ప్రజల ప్రాణాలను కాపాడేందుకు మనోహర్ నిమ్స్ డైరెక్టర్ కు MEIL మేనేజింగ్ డైరెక్టర్ PV.కృష్ణారెడ్డి రాసిన లేఖలో విరాళాన్ని ప్రకటించారు. NIMSలో అత్యవసర చికిత్స కోసం రోగులకు అవసరమైన వెంటిలేటర్ల ఏర్పాటుకు ₹41.95 లక్షల విరాళాన్ని మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ సంస్థ అందచేసింది. MEIL సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ PV కృష్ణారెడ్డి నిమ్స్ సంచాలకులు డాక్టర్ కె. మనోహర్ కు చెక్ పత్రాన్ని
అందజేశారు. భారతదేశం యొక్క విలువైన వనరులను- మానవశక్తిని కబళించే కోవిడ్ వ్యాప్తిని నిలువరించేందుకు మేము మీకు సహాయం చేయాలనుకుంటున్నాము.

దేశంలో అత్యవసర విపత్తు కారణంగా పోరాడటానికి, ప్రజల పక్షాన నిలబడటానికి, మీకు మద్దతు ఇవ్వడానికి మేము ముందుంటామన్నారు. కరోనా కష్టాల్లో అత్యవసర చికిత్స పొందే రోగులకు చాలా అవసరమైన వెంటిలేటర్లు, రవాణా సదుపాయాలు కూడా అందించనుంది. పేద ప్రజలకు, రోగుల సేవకు ఎప్పుడైనా, ఏదైనా అత్యవసరం సమయంలో సహకరించేందుకు MEIL సంస్థ ఎల్లవేళలా సిద్ధంగా ఉంటుందని లేఖలో మేఘా సంస్థ MD పీవీ. కృష్ణారెడ్డి తెలిపారు. దేశం మొత్తం ప్రస్తుతం అత్యంత క్లిష్టమైన
కోవిడ్-19 వ్యాప్తితో తీవ్ర ఇబ్బందులతో దేశం మొత్తం వైద్య సేవల కోసం ఆశతో ఎదురుచూస్తోంది. ఈ మహమ్మారిని ఎదుర్కోవడంలో వైద్యులు తమ ప్రాణాలను పణంగా పెడుతున్నారు. దేశమంతటా ‘జనతా కర్ఫ్యూ’లో వైద్యుల సేవలను కొనియాడుతున్నారు. ఈ కరోనా వ్యాధిని ధైర్యంగా ఎదుర్కొని, వైద్యులు వెనకడుగు వేయకపోవడం అనిర్వచనీయమని నిమ్స్ డైరెక్టర్ కు రాసిన లేఖలో
MEIL MD అభిప్రాయబడ్డారు.