నిర్భయ నిందితుల ఉరిశిక్ష ఉదయాన్నే 5.30AM

నిర్భయ నిందితుల ఉరిశిక్ష ఉదయాన్నే 5.30AM

నిర్భయ కేసు నిందితుల ఉరిశిక్షకు కౌండౌన్ ప్రారంభమైంది. తీహార్ జైలు పోలీసు అధికారులు మరికొన్ని గంటల్లో ఉరిశిక్షను అమలు చేయనున్నారు. పాటియాల కోర్టు తీర్పు ఆదేశాలు అనుగుణంగా శుక్రవారం ఉదయం 5:30 గంటలకు ఉరిశిక్ష అమలుకు సర్వంసిద్ధంగా ఉంచారు. ఇప్పటికే ఉరి వేసేందుకు అలహాబాద్ నుంచి ఓ తలారిని, బక్సర్ నుంచి ప్రత్యేకంగా ఊరితాళ్ళు జైలు సిబ్బంది తెప్పించారు. రెండు రోజుల క్రితం డమ్మీ ఉరిశిక్షను అమలైంది. నిందితుల కుటుంభ సభ్యులు చివరి చూపుకోసం జైలులో అనుమతి కోరడం జరిగింది.


2012 డిసెంబర్16న కదులుతున్న బస్సులో ఓ పారా మెడికల్ విద్యారిపై అత్యాచారం, హత్య దేశమంతటా కలకలం సృష్టించిన విషయం అందరికి తెలిసిందే. ఉరి శిక్షను వాయిదాలు వేసేందుకు నిందితులు పలుమార్లు న్యాయస్థానాలు, క్షమాభిక్ష కోరడం కారణంగా నిందితులు సుదీర్ఘంగా ఎనిమిది సంవత్సరాలు జైల్లో గడిపారు.
ఢిల్లీలోని సాకేత్ కోర్టు సుదీర్ఘంగా వాదనలు విన్న తరువాత 2013లో దోషులుగా తేల్చుతూ ఉరిశిక్ష ఖరారు చేసింది.
2017 సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయడంతో సాకేత్
కోర్టు తీర్పునే అత్యున్నత న్యాయస్థానం సమర్థించింది.
ఎట్టకేలకు శుక్రవారం మార్చి 20 ఉదయం 5గంటల 30 నిముషాలకు ఉరిశిక్ష అమలు కాబోతోంది.