నేడే తిహార్ జైల్లో నిర్భయ దోషులకు డమ్మీ ఉరి.

నేడే తిహార్ జైల్లో నిర్భయ దోషులకు డమ్మీ ఉరి.

నిర్భయ హత్యాచారం కేసులో నలుగురు దోషులకు ఉరి తీసేందుకు ఢిల్లీలోని తిహార్ జైలు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. నిర్భయ దోషులకు ఈ నెల 20న ఉరి తీసేందుకు జైలు అధికారులు సిద్ధమవుతున్నారు. నిర్భయ దోషులైన ముకేష్ సింగ్, అక్షయ్ సింగ్ ఠాకూర్, పవన్ గుప్తా, వినయ్ శర్మలకు ఉరి తీసేందుకు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర సెంట్రల్ జైలు నుంచి తలారీ ఢిల్లీలోని తిహార్ జైలుకు వచ్చారు. నిర్భయ దోషుల ఉరికి ముందు వారి బరువును బట్టి ఇసుక బస్తాలతో తిహార్ జైలు గదిలో బుధవారం డమ్మీ ఉరి కార్యక్రమాన్ని జైలు అధికారులు చేపట్టారు. నిర్భయ దోషులు నలుగురికి ఈ నెల20వతేదీన ఉదయం ఐదున్నర గంటలకు ఉరితీయాలని కోర్టు డెత్ వారెంట్ జారీ చేసింది.