నిర్భయ దోషులకు ఉరి అమలు. ఎన్నాళ్లో వేచిన ఉదయం.

ఎన్నాళ్లో వేచిన ఉదయం. నిర్భయ దోషులకు ఉరి అమలు.

శుక్రవారం తెల్లవారుజామున 5.30AM నిమిషాలకు నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలు చేశామని తీహార్ జైలు డైరెక్టర్ సందీప్ గోయల్ ప్రకటించారు. ఢిల్లీలో నడిరోడ్డుపై 2012లో
ఓ అమ్మాయిని సామూహిక అత్యాచారం, హత్య కాబడ్డ సంఘటన దేశంలో సంచలనం రేపింది. నిర్భయ తల్లి ఆశా దేవి ఎన్నాళ్లో న్యాయ పోరాటం చేయగా ఈ రోజుతో న్యాయం జరిగిందన్నారు. దేశంలోని మహిళకు ఈ ఉరి సంఘటన అమలు చేసిన 20.03.2020 రోజును అంకితమిస్తున్నాను అన్నారు. నలుగురు నిందితులు ముకేశ్‌ (32), పవన్‌ గుప్తా (25), వినయ్‌ శర్మ (26), అక్షయ్‌ కుమార్‌ సింగ్‌ (31)లు మరణశిక్షను జైలు అధికారులు ఆమెకు చేశారు.

అలహాబాద్ నుంచి ఓ తలారిని, బక్సర్ నుంచి ప్రత్యేకంగా ఊరితాళ్ళు జైలు సిబ్బంది తెల్లవారు జామున ఉరిని అధికారికంగా ఆమెకు చేశారు. 2012 డిసెంబర్16న కదులుతున్న బస్సులో ఓ పారా మెడికల్ విద్యారిపై అత్యాచారం, హత్య దేశమంతటా కలకలం సృష్టించిన విషయం అందరికి తెలిసిందే.

ఢిల్లీలోని సాకేత్ కోర్టు సుదీర్ఘంగా వాదనలు విన్న తరువాత 2013లో దోషులుగా తేల్చుతూ ఉరిశిక్ష ఖరారు చేసింది.
అప్పటి నుంచి చట్టలల్లోని లొసుగులు అడ్డం పెట్టుకుని
కోర్టుల్లో పిటిషన్లు వేసుకుంటూ 7 ఏళ్లు సమయాన్ని లాక్కుంటూ వచ్చారు. కానీ ఎప్పటికైనా న్యాయం గెలుస్తుంది. ఎట్టకేలకు శుక్రవారం మార్చి 20 ఉదయం 5గంటల 30 నిముషాలకు ఉరిశిక్ష అమలు చేయబడింది.

2012 డిసెంబర్ 16 నాడు 23 ఏళ్ల ఫిజియోథెరపీ విద్యార్థినిపై నడుస్తున్న బస్సులో ఆరుగురు సామూహిక అత్యాచారం చేశారు. విద్యార్థిని, ఆమె స్నేహితుడిని తీవ్రంగా కొట్టారు. ఇద్దరినీ రోడ్డు పక్కన విసిరేశారు. 2012 డిసెంబర్ 17 నాడు ప్రధాన నిందితుడు, బస్ డ్రైవర్ రామ్ సింగ్‌ను అరెస్టు చేశారు. తర్వాత కొన్ని రోజులకే అతడి తమ్ముడు ముకేశ్ సింగ్, జిమ్ ఇన్‌స్ట్రక్టర్ వినయ్ శర్మ, పండ్లు అమ్మే పవన్ గుప్తా, బస్ హెల్పర్ అక్షయ్ ఠాకూర్, 17 ఏళ్ల బాలుడిని అరెస్టు చేశారు. 2012 డిసెంబర్ 29 నాడు సింగపూర్‌లోని ఒక ఆస్పత్రిలో బాధితురాలి మృతి. శవాన్ని తిరిగి ఢిల్లీకి తీసుకొచ్చారు.
2013 మార్చి 11 నాడు నిందితుడు రామ్ సింగ్ తీహార్ జైలులో అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. పోలీసులు అతడు అత్మహత్య చేసుకున్నాడని చెబితే, అతడి తరఫు వకీలు, కుటుంబ సభ్యులు మాత్రం అది హత్య అని ఆరోపించారు. 2013 ఆగస్టు 31 నాడు జువైనల్ జస్టిస్ బోర్డ్ మైనర్ నిందితుడిని దోషిగా తేల్చింది. మూడేళ్లపాటు జువైనల్ హోంకు పంపింది. 2013 సెప్టెంబర్ 13 నాడు ట్రయల్ కోర్టు నలుగురు నిందితులను దోషిగా ఖరారు చేస్తూ, ఉరిశిక్ష విధించింది.

ఉరి తీసిన తీహార్ జైలు బయట జనం.