నిర్భయ దోషులకు ఉరి శిక్ష అమలు ఎప్పుడు???

నిర్భయ దోషులకు ఉరి శిక్ష అమలు ఎప్పుడు???

నిర్భయ దోషులకు మార్చి 3న ఉరిశిక్ష అమలుచేయాలంటూ ఢిల్లీ పాటియాలా హౌస్ కోర్టు మూడోసారి డెత్ వారెంట్ జారీచేసిన విషయం తెలిసిందే. కానీ దోషులు మాత్రం మరోసారి ఉరిని వాయిదా కోసం చేయని ప్రయత్నమంటూ లేదు. న్యాయపరమైన అంశాలను ఉపయోగించుకుని దోషులు ఉరి వాయిదా వేసేందుకు ఇప్పటి వరకు ప్రయత్నించారు.
నేడు సర్వోన్నత న్యాయస్థానం సోమవారం నిర్భయ దోషి పవన్ గుప్తా దాఖలు చేసిన క్యూరేటివ్ పిటిషన్‌ను జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్, జస్టిస్ ఆర్ భానుమతి, జస్టిస్ అశోక్ భూషణ్‌ల ధర్మాసనం తిరస్కరించింది. తన ఉరిశిక్షను యావజ్జీవిత శిక్షగా మార్చాలని పవన్ గుప్తా పిటిషన్ దాఖలు చేసుకుని ఘటన జరిగే నాటికి తాను మైనర్‌ నంటూ కింది కోర్టు తీర్పును పునఃసమీక్షించాలని విజ్ఞప్తి చేశాడు. పవన్ గుప్తా పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేయడంతో నలుగురు దోషులకు న్యాయపరంగా అన్ని మార్గాలూ మూసుకుపోయాయి.
దీంతో క్షమాభిక్ష కోసం రాష్ట్రపతికి పిటిషన్ దాఖలు చేయనున్నారు. గతంలో ముఖేశ్ కుమార్ సింగ్, వినయ్ కుమార్ శర్మ దాఖలు చేసిన క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి తిరస్కరించగా దీనిని సుప్రీంలో సవాల్ చేశారు. అక్షయ్ కుమార్ మాత్రం దీనిపై సుప్రీంలో పిటిషన్ వేయలేదు.
అలాగే పాటియాలా హౌస్‌ కోర్టు సోమవారం డెత్ వారెంట్లపై
స్టే ఇవ్వాలన్న నిర్భయ దోషి అక్షయ్‌ వేసిన పిటిషన్‌ను కొట్టివేసింది.

ఓ వైపు కోర్టుల్లో ఒక్కో దోషి ఒక్కోసారి న్యాయపరంగా పిటిషన్లు వేస్తూ మరోవైపు రాష్ట్రపతికి క్షమాభిక్ష అంటూ విజ్ఞప్తి పెట్టుకోవడం చూస్తుంటే మన ప్రజాస్వామ్యంలో లోసుగులు మనల్ని చూసి హేళన చేస్తున్నాయి. మార్చి రెండు 2020 నాటికి కూడా అంటే దాదాపు 8 ఏళ్లు అవుతున్నప్పటికి ఎప్పుడు????? ఈ నిర్భయ దోషులకు ఉరి శిక్షను అమలు చేస్తారో స్పష్టత రాకపోవడం గమనార్హం.

ఢిల్లీలో 2012 డిసెంబర్ 16 రాత్రి 11 గంటల తర్వాత ఓ యువతి తన స్నేహితుడితో కలిసి బస్సు ఎక్కింది. బస్సులో అయిదుగురు పురుషులు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమెతో ఉన్న స్నేహితుడిని కొట్టారు. చావుబతుకుల మధ్య ఉన్న వారిద్దరినీ రోడ్డుపై పడేసి వెళ్లిపోయారు. ఇది చూసిన కొందరు పోలీసులకు సమాచారం అందించడంతో వెంటనే వారిని ఆసుపత్రిలో చేర్చారు. తీవ్రంగా గాయపడిన నిర్భయ మరణించింది. ఆ భయంకరమైన అనుభవం నుంచి కోలుకోలేకపోయినా గాయాల నుంచి కోలుకున్న ఆ స్నేహితుడు మాత్రం బతికాడు.