భార్యతో కలిసి పర్యాటక ప్రదేశాలు చూస్తున్న నితిన్

భార్యతో కలిసి పర్యాటక ప్రదేశాలు చూస్తున్న నితిన్

సినీనటుడు నితిన్ ప్రస్తుతం రంగ్ దే సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం దుబాయ్ లో జరుగుతోన్న నేపథ్యంలో తన భార్య శాలినిని కూడా తన వెంట తీసుకువెళ్లాడు.ఓపక్క, షూటింగ్ లో పాల్గొంటూ.. మరోపక్క షూటింగ్ పూర్తైన వెంట‌నే త‌న భార్యతో కలిసి దుబాయ్ లోని పర్యాటక ప్రదేశాలన్నింటినీ చూస్తున్నాడట. దుబాయ్ లో షూటింగు నేపథ్యంలో ఒకేసారి సినిమా పనితో పాటు హ‌నీమూన్ నూ కూడా ఎంజాయ్ చేస్తున్నాడు.కాగా, రంగ్ దే సినిమా సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌‌పై రూపుదిద్దుకుంటోంది. నితిన్ సరసన కీర్తి సురేశ్ ఇందులో నటిస్తోంది. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాకు సూర్యదేవర నాగవంశీ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.