ఏపీలో వలస కార్మికులకు 1902 నెంబర్

లాక్ డౌన్ కారణంగా ఇతర రాష్ట్రాల్లో, రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో చిక్కుకున్న వలస కార్మికులకు మార్గదర్శకాలు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం. కేంద్ర ఆదేశాల మేరకు మార్గదర్శకాలు ఉత్తర్వులు జారీ.

రాష్ట్రంలో ని ఇతర జిల్లాల లో చిక్కుకున్న వలస కార్మికులు 1902కి ఫోన్ చేసి వివరాలు నమోదు చేసుకోవాలి. కేవలం గ్రీన్ జోన్ నుండి గ్రీన్ జోన్ లకు మాత్రమే అనుమతి. రిలీఫ్ క్యాంప్ లో నుండి స్వగ్రామాలకు వెళ్లాలి అనుకునే వాళ్ళకు రాండమ్ గా పరీక్షలు, కోవిడ్ పరీక్షల్లో నెగటివ్ వస్తె వారిని బస్సులో 50 శాతం కు మించకుండా తరలించాలని ఆదేశాలు. స్వగ్రామాల్లో సైతం మరోసారి 14 రోజుల క్వారంటైన్, అనంతరం మరో 14 రోజులు హోం క్వారంటైన్, ఎవరికైనా పాజిటివ్ వచ్చినట్టు గుర్తిస్తే ఆ గ్రూపు మొత్తాన్ని అక్కడే ఉంచాల్సిందిగా సూచించిన ప్రభుత్వం, పాజిటివ్ వచ్చిన వ్యక్తిని వెంటనే ఆసుపత్రి తీసుకెళ్లాలని ఆదేశాలిచ్చారు.

ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న వారి గురించి ఆ రాష్ట్రాల అధికారులతో సమన్వయం చేసుకోవాల్సిందిగా ఆదేశాలు. ప్రతి జిల్లాలో ఒక బస్టాండ్, రైల్వే స్టేషన్ గుర్తించాలని, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళు ఆ జిల్లా యంత్రాంగం అనుమతి ఇచ్చిన రైల్వే స్టేషన్, బస్టాండ్ చేరుకునేందుకు ఏర్పాట్లు చేసారు. వచ్చిన వారికి స్క్రీనింగ్ తో సహా, పూల్ పద్ధతిలో కరోనా పరీక్షలు నిర్వహించాలని, ఇతర రాష్ట్రాల్లో రెడ్ జోన్, కంటెన్మెంట్ జోన్ నుండి వచ్చే వారిని ప్రత్యేకంగా గుర్తించాలని సూచించిన ప్రభుత్వం, ఆ ప్రాంతాల నుంచి వచ్చిన వారిని వెంటనే 14 రోజుల క్వారంటెన్ కు పంపి…. పరీక్షల అనంతరం బయటకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చారు.