కరోనా సోకని ప్రాంతాలు తెలుసా?

ప్రపంచ వ్యాప్తంగా 8,58,371మందికి పైగా కరోనా సోకింది. ఏప్రిల్ 1st 2020 నాటికి 42,146 మంది మృత్యువాత పడ్డారు. మన భూగోళంలోని 190 వరకు దేశాల్లో ఈ వైరస్ మహమ్మారి గుండె దడ పుట్టిస్తోంది. అయినప్పటికీ కోవిడ్-19 సోకని దేశాల్లో ఒక్కటి పలావు ద్వీపం. ఉత్తర పసిఫిక్‌లోన్న ఈ ప్రదేశం జనాభా 18,000, ఏ ఒక్కరికి కొవిడ్‌-19 పాజిటివ్‌ కేసు నమోదు కాలేదంటే ఆశ్చర్యము అవసరం లేదు.అంతేకాదండోయ్ టోంగా, సోలమన్‌ దీవులు, మార్షల్‌ దీవులు, మైక్రోనేషియాతో సహా ఈ ప్రాంతంలోని అనేక దేశాలు తమకు కరోనా విస్తరించకుండా విధించుకున్న కఠినమైన ప్రయాణ ఆంక్షలు, ముందు జాగ్రత్తలు అక్కడి ప్రజల ప్రాణాలకు దోహదపడ్డాయి.