జీఎస్టీలో పన్నుల హేతుబద్ధీకరణపై చర్చ జరగలేదు

*జీఎస్టీలో పన్నుల హేతుబద్ధీకరణపై చర్చ జరగలేదు*

రాజ్యసభలో శ్రీ వి.విజయసాయి రెడ్డి ప్రశ్నకు ఆర్థిక మంత్రి జవాబు

న్యూఢిల్లీ, నవంబర్ 30: పన్నుల హేతుబద్దీకరణపై జీఎస్టీ కౌన్సిల్ లోతైన చర్చ జరగలేదని ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మల సీతారామన్ స్పష్టం చేశారు. ప్రస్తుతం జీఎస్టీలో అమలులో ఉన్న నాలుగు టాక్స్ శ్లాబులను ఖజానాకు ఎలాంటి ఆదాయ నష్టం వాటిల్లకుండా మూడు శ్లాబులగా మార్చవచ్చునని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ సంస్థ చేసిన సిఫార్సును ప్రభుత్వం పరిశీనలోకి తీసుకుందా అని మంగళవారం రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో వైఎస్సార్సీపీ సభ్యులు శ్రీ వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆర్థిక మంత్రి పై విధంగా జవాబిచ్చారు. జీఎస్టీ విధానం అమలులోకి తీసుకువచ్చిన తొలినాళ్ళలో అనేక అంశాల ప్రాతిపదికపై నాలుగు శ్లాబుల రేటు విధానాన్ని ఎంచుకోవడం జరిగిందని మంత్రి తెలిపారు. అయితే కాలగమనంలో ఈ విధానం వలన కొన్ని అంశాల్లో రెవెన్యూ న్యూట్రాలిటీ తారుమారవుతున్నందున నాలుగు శ్లాబుల టాక్స్ రేటును పునఃసమీక్షించాలని జీఎస్టీ కౌన్సిల్ అభిప్రాయపడినట్లు చెప్పారు. ఒకే దేశం-ఒకే పన్ను విధానంపై కూడా చర్చ జరుగుతోంది. అయితే కరోనా మహమ్మారి, ఇతర కారణాల నేపథ్యంలో పన్నుల హేతుబద్దీకరణపై లోతైన చర్చ జరగలేదని తెలిపారు.