మనుషులేన మూగజీవాలు అకలితో విలవిల

దేశంలో లాక్ డౌన్ కారణంతో మనుషులకే ఆహార పానీయాలు దొరకడం కష్టమైంది అలాంటిది మూగ జీవాలు అందులో శాఖాహారులు మన వానరాలు ఆకలితో అలమటిస్తోన్న విషయాన్ని గమనించి ఓ మనావాతావాది ఆహారాన్ని అందించారు. తెలంగాణలోని యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం నెల రోజులుగా మహామ్మారి వైరస్ ఉండటంతో భక్తులు ఎవరు కూడా రాకపోవడంతో ఆలయంలోన్న ముగజీవాలైన వేలాది కోతులకు తినడానికి తిండి లేక అల్లాడుతున్నవి. ఐతే భక్తులు వస్తూన్నప్పుడు కోతులకు కొబ్బరి చిప్పలు, పండ్లు , పులిహోర, అన్నం ఇలా రోజు ఆహారం దొరికేది.. కానీ ప్రస్తుతం ఆలయానికి భక్తుల దర్శనాలను రద్దు చేయడంతో కోతులు ఆకలితో అలమటిస్తున్నాయి.

ఈ విషయాన్ని గమనించిన స్థానికంగా అటోతో జీవన భృతిని కొనసాగించే నరేష్ అనే యువకుడు పండ్లను తీసుకెళ్లి కోతులకు ఆహారాన్ని అందిస్తు ఆ మూగ జీవాల కడుపు నింపుతున్నాడు. ప్రతి రోజు మధ్యాహ్నం తన చేతనైనంత స్థోమతకు తగ్గట్టు పండ్లు కొని గుట్టపైకి వెళ్లి కోతులకు ఆహారాన్ని అందిస్తున్నాడు. ఈ మనసున్న మనిషి నరేష్ ముగజీవాలపై ఉన్న ప్రేమను చూసి ప్రతి ఒక్కరు అభినందిస్తున్నరు. ఈ అపత్కాలంలో ప్రతి ఒక్కరు ముగజీవాలను ఆదుకోవాలని ఆహారం అందించాలని, ప్రకృతిలో, జీవవైవిధ్యములో భాగమైన ప్రతి ప్రాణిని కాపాడాలని మూగజీవుల ప్రేమికుడు నరేష్ ప్రజలకు
విజ్ఞప్తి చేసాడు.