పెళ్లి ఆలోచన చేయడం లేదన్న తమన్నా

మిల్కీబ్యూటీ తమన్నా ఇండస్ట్రీలో అడుగు పెట్టి ఇటీవలే 15 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఇంకా కూడా హీరోయిన్ గానే ఈ అమ్మడు కొనసాగాలని ఆశ పడుతుంది. మూడు పదుల వయసు దాటిన ఈ అమ్మడు స్టార్ హీరోలకు మాత్రమే కాకుండా యంగ్ హీరోలకు కూడా జోడీగా నటిస్తున్న విషయం తెల్సిందే. ఇటీవల 15 ఏళ్ల సినీ కెరీర్ ను పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఈ అమ్మడు ఒక ఆంగ్ల మీడియా కు ఇంటర్వ్యూ ఇచ్చింది.

ఆ ఇంటర్వ్యూలో తన పెళ్లి గురించి మాట్లాడినది. ప్రస్తుతానికి పెళ్లి చేసుకోవాలనే ఆలోచన అయితే లేదు. కాని పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు మాత్రం ప్రభాస్.. హృతిక్ రోషన్.. విక్కీ కౌషల్ వంటి వారిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లుగా చెప్పుకొచ్చింది. పెళ్లి కోసం తన తల్లి స్వయంవరం ఏర్పాటు చేస్తే వారిని తాను ఆ స్వయంవరంకు ఆహ్వానిస్తానంటూ చెప్పుకొచ్చింది. ఈ ముగ్గురికి అమ్మాయిల్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెల్సిందే. ఈ ముగ్గురిని స్టార్ హీరోయిన్ అయిన తమన్నా కూడా ఇష్టపడుతుంది.

ఈమె కోరుకున్న లక్షణాలు అన్ని ఉన్న వ్యక్తి పెళ్లి కొడుకుగా కావాలంటే ఈ ముగ్గురిని మిక్సీ లో వేయాల్సిందే అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. తమన్నా ఆశకు హద్దు లేకుండా ఉందని ఈ అమ్మడు ఇలాగే ఆశ పెట్టుకుని ఎదురు చూస్తే మాత్రం పెళ్లి కూడా అవుతుందో లేదో అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తమన్నాకు అసలు పెళ్లి చేసుకోవాలని లేదేమో అందుకే ఇలాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయిలు కావాలని కోరుకుంటుందని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు