తెలంగాణలో RTC బస్సులు నడపడం లేదు. CM KCR

ఆర్టీసీ స‌ర్వీసుల‌ను ప్రారంభించ‌డం లేదు. కేంద్రం కేవ‌లం గ్రీన్ జిల్లాల్లో న‌డిపించుకోడానికి అనుమ‌తి ఇచ్చింది. 18 ఆరేంజ్ జోన్లు త్వ‌ర‌లోనే గ్రీన్ జోన్లుగా మార‌నున్నాయి. 15న స‌మీక్షా స‌మావేశం జ‌రుగుతుంది. ఆ త‌రువాత హైద‌రాబాద్‌లో కూడా షాపులు తెరిచే అవ‌కాశం ఉంది. ఢిల్లీ, చెన్నై, బెంగుళూరు, ముంబై నుంచి నుంచి మ‌న‌కు పాఠాలు వ‌స్తాయి. వాటి అనుభ‌వాల‌ను తెలుసుకోవాలి. హైద‌ర‌బాద్ తాళం తెరిస్తే వాహ‌నాలు వ‌ర‌ద‌లా ప్ర‌వ‌హిస్తాయి. పోలీసులు కూడా నియంత్రించ‌లేరు. ఆర్టీసిని 15వ తేదీ వ‌ర‌కు న‌ప‌డం. 15 త‌రువాత న‌డిపే అవ‌కాశం ఉంటుంది. ఆటోల‌కు, క్యాబ్‌ల‌కు కేవ‌లం గ్రీన్ జోన్ల‌లో అవ‌కాశంఉంది. చ‌నిపోతే 10 మంది, పెళ్ళి చేసుకుంటే 20 మందికి అనుమ‌తిస్తాం.