ఈశాన్య అంతర్జాతీయ సరిహద్దు మూసివేత

భారతదేశంలో లాక్ డౌన్ కారణంగా ఈశాన్య ప్రాంతంలో అంతర్జాతీయ సరిహద్దు దాదాపు 5500 కి.మీ స‌మ‌ర్థంగా కేంద్రం మూసివేసింది. దేశంలోని ఈశాన్య ప్రాంత రాష్ర్టాల‌లో కోవిడ్‌-19 వ్యాప్తిని స‌మ‌ర్థంగా ఎదుర్కొనేందుకు అవ‌స‌ర‌మైన అన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్నామని ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ స‌హాయ మంత్రి డాక్ట‌ర్ జితేంద్ర సింగ్ తెలిపారు.

కోవిడ్ నేప‌థ్యంలో ఈశాన్య ప్రాంతంలో లాక్డౌన్ అలువుతున్న తీరును స‌మీక్షించేందుకు ఆయ‌న శుక్ర‌వారం అధికారుల‌తో స‌మ‌గ్ర వీడియో క‌న్ఫ‌రెన్స్‌ను నిర్వ‌హించారు. ఈ స‌మావేశంలో ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ, ఈశాన్య రాష్ర్టాల మండ‌లి, నార్త్ ఈస్ట్ర‌న్ డెవ‌ల‌ప్‌మెంట్ ఫైనాన్స్ కార్పొరేష‌న్ లిమిటెడ్ లకు చెందిన అధికారుల‌తో పాటుగా ఈశాన్య ప్రాంత అభివృద్ధికి మంత్రిత్వశాఖ కార్య‌ద‌ర్శి, అద‌న‌పు కార్య‌ద‌ర్శిలు, ఇత‌ర సీనియ‌ర్ అధికారులు కూడా పాల్గొన్నారు. మంత్రిత్వ శాఖకు చెందిన 100% పని ఈ-ఆఫీస్ వేదిక‌గా ముందుకు సాగుతోంద‌ని మంత్రి తెలిపారు. ఫ‌లితంగా ప్ర‌భుత్వ ఆదేశాల మేర‌కు ఇంటివద్ద నుంచి ప‌ని విధానంలో కార్య‌క‌లాపాలు చేప‌ట్టేందుకు వీలుప‌డుతోంద‌ని ఆయ‌న తెలిపారు. లాక్డౌన్ నేప‌థ్యంలో ఈశాన్య రాష్ట్రాలలో విస్త‌రించి ఉన్న దాదాపు 5500కి.మీ. నిడివిగ‌ల అంత‌ర్జాతీయ స‌రిహ‌ద్దును స‌మ‌ర్థంగా మూసివేయ‌బ‌డిన‌ట్టుగా మంత్రి తెలిపారు. కోవిడ్ వైర‌స్‌పై పోరుకు స‌ర్కారు చేస్తున్న పోరుకు బాస‌ట‌గా నిలిచేందుకుగాను ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వశాఖ దాని అనుబంధ సంస్థ‌లు, ఇక్క‌డున్న ప్ర‌భుత్వ రంగ సంస్థ‌లకు చెందిన అధికారులు, సిబ్బంది తమ ఒక్క‌రోజు వేత‌నాన్ని పీఎం-కేర్స్ ఫండ్‌కు విరాళంగా ఇవ్వ‌నున్నారు. ఈ నిధికి సాయం అందించేందుకు ముందుకు వ‌చ్చిన సంస్థ‌ల్లో ఎన్ఈసీ, ఎన్ఈడీఎఫ్ఐ, ఎన్ఈహెచ్‌హెచ్‌డీసీ, ఎన్ఈఆర్ఏఎం ఏసీ, సీబీటీసీతో పాటు ఎన్ఈఆర్‌సీఓఎంపీ త‌దిత‌ర సంస్థ‌లు ఉన్నాయి. దీనికి అద‌నంగా ఎన్ఈడీఎఫ్ఐ త‌న సీఎస్ఆర్ ఫండ్స్ నుంచి రెండు కోట్ల రూపాయ‌ల‌ను పీఎం-కేర్స్ ఫండ్‌కు విరాళంగా ఇవ్వ‌నుంది. కోవిడ్‌-19 నేప‌థ్యంలో లాక్డౌన్‌ను స‌మ‌ర్థంగా ఎదుర్కొనేందుకు గాను ఈశాన్య రాష్ర్టాల అభివృద్ధిశాఖ రూ.25 కోట్ల మేర నిధుల‌ను అందించింది. యునైటెడ్ ఫండ్ రూపంలో దీనిని స‌ర్కారు అందించింది. ఈ ప్రాంతంలో ఆరోగ్య మౌలిక స‌దుపాయాల బ‌లోపేతానికి మంత్రిత్వ శాఖ ఎన్ఈఎస్ఐడీఎస్ కింద అవ‌స‌ర‌మైన ప్రాజ్టెక్టులను దాఖ‌లు చేయాల‌ని కోరింది. ఈ నెల 6 లోపు తమ ప్రతిపాదనలను సమర్పించాలని కేంద్ర ప్ర‌భుత్వం
రాష్ట్రాలను కోరింది. ఆరోగ్య రంగంలో ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యతనివ్వ‌నున్న‌ట్టుగా తెలిపింది.