మరణాంతర పరిణామాల కోసమే నార్త్ కొరియా కిమ్ జాంగ్ ఉన్ అదృశ్యం మిస్ట‌రీ??

ఉత్త‌ర కొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ అదృశ్యం మిస్ట‌రీని వీడి బ‌య‌టిప్ర‌పంచంలోకి రావ‌డంతో ఆయ‌న వెన‌క కుట్ర‌లు ప‌న్నిన‌వారి గుండెళ్ళో రైళ్లు ప‌రుగెడుతున్నాయి.సంచ‌ల‌నాల నిర్ణ‌యాలు.. అత్యంత‌దారుణ‌మైన కిరాత‌కాలు.. త‌న‌కు ఆగ్ర‌హం తెప్పించే ఎంత‌టి వారినైనా మ‌ర‌ణ‌శాస‌నాన్ని లిఖించే నియంత‌ కింగ్ జాంగ్ ఉన్ 20 రోజుల ఉత్కంఠ‌కు తెర‌దింపాడు. విల‌క్ష‌ణ‌మైన చేష్ట‌ల‌తో ప్ర‌పంచ‌వ్యాప్తంగా సంచ‌ల‌నాల‌కు పెట్టింది పేరుగా ఉన్న ఉత్త‌ర కొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్‌కు ఒక విచిత్ర‌మైన ఆలోచ‌న వ‌చ్చింది.

ఆ ఆలోచ‌న ఏమిటంటే.. త‌న త‌ద‌నాంత‌రం ఉత్త‌ర‌కొరియాలో జ‌ర‌గ‌బోయే ప‌రిణామాల‌ను తెలుసుకోవాలనుకున్నారు. ఆల‌స్యం చేయ‌కుండా అదృశ్యం క‌థ‌ను న‌డిపించిన‌ కిమ్ జాంగ్ ఉన్ ప్ర‌పంచ వ్యాప్తంగా సంచ‌ల‌నాన్ని రేకెత్తించాడు. ఉత్త‌ర కొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ అదృశ్యం వెనుక మిస్ట‌రీ దాగి ఉంద‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. కిమ్ జోంగ్ ఉన్ ఏప్రిల్ 11 వ తేదీ నుంచి మే1వ తేదీ వరకు ఎవరికి కనిపించకుండా అదృశ్యం అయ్యాడు. కిమ్ ఆరోగ్యం పూర్తిగా క్షీణించింద‌ని, గుండెకు శ‌స్త్ర చికిత్సి చేయించుకున్నారని, దీంతో అయన సోదరి కిమ్ యో జోంగ్ అధికారం చేపట్టబోతుందని వార్తలు వెలువడ్డాయి. కొంద‌రైతే ఒక అడుగు ముందుకువేసి..కిమ్ మరణించినట్టుగా కూడా ఫేక్ ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ఉత్త‌ర‌కొరియాలో చీమ చిటుక్కుమ‌న్నా స‌మాచారం తెలుసుకునే ద‌క్షిణ కొరియా మీడియాకు కూడా కిమ్‌కు సంబంధించి ఎలాంటి విష‌యాలు తెలియ‌లేదు. అగ్ర‌రాజ్యం అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ స‌హా వివిధ దేశాల అధ్య‌క్షులు, ఉన్న‌త ప‌ద‌వుల్లో ఉన్న‌వారు కూడా కిమ్ యోగ‌క్షేమాల‌పై ఆరాతీశారు. ట్వీట్‌లు కూడా చేశారు. అయితే కిమ్‌కు సంబంధించిన వివ‌రాల‌ను ఆయ‌న‌ అత్యంత సన్నిహితులకు తప్పించి బయటకు రానివ్వలేదు. కిమ్ అదృశ్యం కావ‌డం, మృతిచెందార‌నే వార్తలు సృష్టించడానికి ఓ బలమైన కారణం ఉందని అంటున్నారు.

ఒకవేళ కిమ్ మరణిస్తే, త‌ద‌నంత‌రం ఉత్త‌ర కొరియాలో జ‌ర‌గ‌బోయే కుట్ర‌లు, దేశాక్ర‌మ‌ణ‌, ప్ర‌జ‌ల్లో సానుభూతి ఉంటుందా లేదా వాటికి సంబంధించి అనేక విష‌యాల‌ను కిమ్ ప్ర‌త్య‌క్షంగా తెలుసుకున్న‌ట్టు స‌మాచారం. ఎవ‌రైతే కుట్ర‌ల‌కు వ్యూహాలు ర‌చించారో, వారి ప‌ని ప‌ట్టేందుకు నియంత కిమ్ సిద్ధం అవుతున్న‌ట్టు తెలుస్తోంది. ఇప్ప‌టికే ఆ వివ‌రాల‌న్నీ తెలుసుకున్న‌కిమ్ త్వ‌ర‌లోనే త‌న‌దైన శైలిలో శిక్ష‌లు విధించ‌డానికి కార్య‌చ‌ర‌ణ సిద్ధం చేస్తున్న‌ట్టు స‌మాచారం.