NRIs కూపనుండగా భయమెందుకు దండగా…

UK లండన్‌లోని “ఎన్నారై టీఆర్‌ఎస్‌ యూకే” ఆధ్వర్యంలో ప్రవాస విద్యార్థులకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం జరిగింది. టీఆర్‌ఎస్‌ పార్టీ 20వ ఆవిర్భవ దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.

సీఎం కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రసిడెంట్‌ కేటీఆర్‌ పిలుపుతో కరోనా వల్ల ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న విద్యార్థులకు బౌతిక దూరం పాటిస్తూ నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. దీని కోసం కేసీఆర్‌ కూపన్స్‌ కార్యక్రమాన్ని ఎంపీ సంతోష్‌ కుమార్‌ హైదరాబాద్‌లో ప్రారంభించారు. నాటి ఎన్నారై టీఆర్‌ఎస్‌ ఆవిర్భావం నుంచి నేటి వరకు వెన్నంటే ఉండి ప్రోత్సహిస్తూ ఈ రోజు కేసీఆర్‌ కూపన్స్‌ కార్యక్రమంను ప్రారంభించిన సంతోష్‌కుమార్‌కు టీఆర్‌ఎస్‌ యూకే అధ్యక్షుడు అశోక్‌గౌడ్‌ దూసరి, వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్‌ కూర్మాచలం కృతజ్ఞతలు తెలిపారు.