దేశంలో కరోనా కరెంటును కాటేయలేక కాలిపోతోంది

క‌రోనా వైర‌స్ వివిధ రంగాల‌పై తీవ్ర ప్ర‌భావం చూపించి ఉండ‌వ‌చ్చు కాని అది ఎన్‌.టి.పి.సి స్ఫూర్తిని ఏమాత్రం దెబ్బ‌తీయలేక‌పోయింది. ఎన్‌.టి.పి.సి దేశానికి నిరంత‌రాయ విద్యుత్‌ను స‌ర‌ఫ‌రా చేస్తున్న 62,110 మెగా వాట్ల స్థాపిత సామ‌ర్ధ్యంగ‌ల భార‌త‌దేశంలోనే అతిపెద్ద విద్యుత్ ఉత్ప‌త్తి సంస్థ‌.

NTPCకి చెందిన ప్ర‌తి విద్యుత్ స్టేష‌న్ ప్రస్తుత‌ ప‌రిస్థితికి అనుగుణంగా గ‌రిష్ఠ‌స్థాయి ప‌నితీరు క‌న‌బ‌రుస్తున్న‌ది. కోవిడ్ -19 సంక్షోభం విద్యుత్ వినియోగ అనివార్యతను నొక్కిచెప్పింది, ఆర్థిక వ్యవస్థలోని అనేక రంగాలు సజావుగా పనిచేయడానికి విద్యుత్తు చాలా కీలకం కనుక ఇది ఎక్కువ ప్రాముఖ్యతను సంతరించుకుంది. నిరంతర విద్యుత్ సరఫరా కోసం బొగ్గు సరఫరాను కూడా ఎన్‌టిపిసి సమర్థవంతంగా నిర్వహిస్తోంది.

ఎన్‌టిపిసిసిబ్బంది ముందు వరుసలో ఉండి, నిరంత‌ర‌ విద్యుత్ సరఫరా జ‌రిగేట్టు చూస్తున్నారు, అన్ని ఎన్‌టిపిసి ప్లాంట్లు సామాజిక దూరానికి సంబంధించిన మార్గదర్శకాలకు కట్టుబడి ప‌నిచేస్తున్నాయి.. విద్యుత్ ఉత్పత్తే కాకుండా, నిరుపేద వర్గాల సంక్షేమానికి , వ‌ల‌స కార్మికుల‌కు, కార్పొరేషన్ గొప్ప కృషి చేస్తోంది వారికి రేషన్ , వైద్య సహాయం అందిస్తోంది.

2600 మెగావాట్ల వ్యవస్థాపిత సామర్థ్యంతో దక్షిణ భారతదేశంలో అతిపెద్ద థ‌ర్మ‌ల్‌ విద్యుత్ కేంద్రమైన ఎన్‌టిపిసి-రామగుండం నిరంతరాయ విద్యుత్ సరఫరా చేస్తోంది .అలాగే సంస్థ‌ ఉద్యోగుల శ్రేయస్సుకు భరోసా ఇస్తోంది. మిగతా ఉద్యోగులందరూ , సిఐఎస్ఎఫ్ సిబ్బంది దేశానికి నిస్వార్థ సేవలను అందిస్తున్నారు. కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన లాక్ డౌన్ మార్గ‌ద‌ర్శ‌కాల‌కు అనుగుణంగా త‌గినంత‌మంది ఉద్యోగుల సంఖ్యతో విద్యుత్ కేంద్రం పనిచేస్తోంది. ఉద్యోగులు కాంట్రాక్ట్ కార్మికుల సేవ‌ల వినియోగం ప్ర‌భుత్వ మార్గదర్శకాల ప్రకారం ఒక ప‌ద్ధ‌తి ప్ర‌కారం నిర్వ‌హించ‌డం జ‌రుగుతోంది.

ఫ్రంట్‌లైన్ వ‌ర్క‌ర్ల‌కు, ఉద్యోగులంద‌రికి, సిఐఎస్ ఎఫ్ సిబ్బందికి మాస్క్ లు అందించారు, శానిటైజర్‌లను చాలా చోట్ల ఉంచారు. ప్లాంట్ , అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయాలలోకి ప్రవేశించే వారితో పాటు టౌన్‌షిప్ ప్రాంతంలోకి ప్రవేశించేవారికి థర్మల్ స్క్రీనింగ్ ప్రారంభమైంది. వెబ్ ఎనేబుల్డ్ వీడియో కాన్ఫరెన్సింగ్ సౌకర్యాల ద్వారా సమావేశాలు జరిగాయి. టౌన్‌షిప్ , ప్లాంట్ గల‌ ప్రాంతాలలో సామాజిక దూరానికి చ‌ర్య‌లు తీసుకోవ‌డం జ‌రిగింది.

కోవిడ్ -19 కు వ్య‌తిరేకంగా దేశ‌వ్యాప్త పోరాటంతో చేతులు క‌లుపుతూ , రామ‌గుండం ఎన్‌.టి.పి.సి , క‌రోనా సంక్షోభ సమ‌యంలో ప్ర‌జ‌ల‌కు స‌హాయం అందించ‌డానికి కేంద్ర , రాష్ట్ర ప్ర‌భుత్వాలు చేప‌డుతున్న చ‌ర్య‌ల‌కు మ‌ద్ద‌తుగా యుద్ద ప్రాతిప‌దిక‌న ప‌నిచేస్తున్న‌ది. కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా, ఎన్‌టిపిసి-రామగుండం 4,500 మంది వలస కూలీలకు రూ 16 ల‌క్ష‌ల విలువైన‌ కిరాణా వస్తువులను పంపిణీ చేయడంతో పాటు రూ. 99.13 లక్షలు, పెద్ద‌పల్లి జిల్లా పరిపాల‌నా యంత్రాంగానికి, రామ‌గుండం పోలీస్ క‌మిష‌న‌రేట్‌కు రూ. కోవిడ్ -19 పై పోరాడటానికి పిపిఇలు, కిట్లు, శానిటైజర్లు మాస్క్‌లను అందించేందుకు స‌హాయంగా రూ 5.00 లక్షలు అందించింది. దీనితోపాటు ప‌వ‌ర్ స్టేష‌న్ ప్ర‌త్యేక ఆరోగ్య శిబిరాల‌ను కార్మికులు నివాసం ఉండే కాల‌నీల‌లో నిర్వ‌హించింది. అలాగే మాస్క్‌లు పంపిణీ చేసింది.

కోవిడ్ మహమ్మారికి వ్యతిరేకంగా తన అప్ర‌మ‌త్త‌త‌స్థాయిని పెంచుతూ , ఎన్‌టిపిసి-రామగుండం భవిష్యత్తులో ఏవైనా అవసరాలు వ‌స్తే వాటిని తీర్చడానికి 25 పడకల క్వారంటైన్ స‌దుపాయాన్ని ఏర్పాటు చేసింది. ఎన్‌టిపిసి -రామగుండం ఆసుపత్రి అటువంటి అత్యవసర పరిస్థితులను నిర్వహించడానికి అవసరమైన పరికరాలను కూడా కొనుగోలు చేసింది.

ఒక కోవిడ్ టాస్క్‌ఫోర్స్ ను ఏర్పాటు చేయ‌డం జ‌రిగింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలను అమలు చేయడానికి అది 24×7 పనిచేస్తోంది. దీనికి తోడు, టౌన్‌షిప్ మరియు ప్లాంట్‌ ప్రాంతాలతో పాటు సమీప ప్రాజెక్టు ప్రభావిత గ్రామాలను క్రిమిసంహారకాల‌ స్ప్రేతో శుభ్రం చేశారు.

ఎన్‌.టి.పి.సి రామ‌గుండం లేడీస్‌క్ల‌బ్ , దీప్తి మ‌హిళా స‌మితి, కాంట్రాక్టు కార్మికులు , సెక్యూరిటీ గార్డులకు 4000 మాస్క్‌లు పంపిణీ చేయడం ద్వారా కోవిడ్ -19 వ్యతిరేకం పోరాటంలో చేరింది. విశేషమేమిటంటే, ఈ క్లాత్ మాస్క్‌ల‌ను వొకేషన్ టైలరింగ్ క్లాసులు తీసుకుంటున్న స్థానిక మహిళలతో పాటు ముసుగులు తయారు చేయడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన లేడీస్ క్లబ్ సభ్యుల చేతిలొ త‌యార‌య్యాయి.

ఎన్‌టిపిసి ఉద్యోగులు , వారి కుటుంబ సభ్యులతో కూడిన ఒక ఎన్‌.జి.ఒ పేద ప్ర‌జ‌ల‌కు అవసరమైన కిరాణా వస్తువులు కూరగాయలను పంపిణీ చేసింది. కరోనావైరస్ పై పోరాడుతున్న వారికి ఆహార ప్యాకెట్లను కూడా పంపిణీ చేశారు. క‌రోనా వైర‌స్ వ్యాప్తి నేప‌థ్యంలో చేయ‌ద‌గిన , చేయ‌కూడ‌ని వాటికి సంబంధించి ప్ర‌ముఖంగా తెలియ‌జేసేందుకు బ్యానర్‌లను ప్రదర్శించడం జ‌రిగింది. ప్లాంట్‌లో, చుట్టుపక్కల ప్రాంతాల‌లో కరపత్రాలను పంపిణీ చేయడం ద్వారా ప్ర‌జ‌ల‌కు అవగాహన కల్పించడానికి కూడా గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయి.

విద్యుత్ కేంద్రాలు ఎటువంటి అంతరాయం లేకుండా ప‌నిచేసేలా చేయ‌డం ద్వారా ఎన్‌.టిపిసి ఉద్యోగులు దేశానికి నిస్వార్థ సేవ‌లు అందించ‌డ‌మే కాకుండా, స్టేక్ హోల్డ‌ర్ల‌కు విద్యుత్ స‌ర‌ఫ‌రాను స‌కాలంలో అందిస్తున్నారు. విద్యుత్ కేంద్రం షెడ్యూల్ ప్రకారం బొగ్గును అందుకుంటోంది, సంస్థ‌వ‌ద్ద‌ తగినంత నిల్వలు కూడా ఉన్నాయి.

హైదరాబాద్‌లోని ఎన్‌టిపిసి సదరన్ రీజియన్ ప్రధాన కార్యాలయం కూడా సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలోని వైద్యులు , ఆరోగ్య కార్యకర్తలకు ఎంతో అవసరమైన పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్‌మెంట్ (పిపిఇ) కిట్‌లను అందించడం ద్వారా కరోనావైరస్ పై పోరాటం లో పాలుపంచుకుంటోంది. గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న పేద కుటుంబాలకు మాస్క్‌లు రేషన్ అందించడానికి ఎన్టిపిసి ఉద్యోగులు పోలీసులకు ఆర్థిక సహాయం స‌మ‌కూర్చారు.

ఎన్‌.టి.పి.సి , ప్రైమ్ మినిస్ట‌ర్ కేర్స్ ఫండ్‌కు రూ 250 కోట్ల రూపాయ‌లు అందించింది.ఎన్‌.టి.పి.సి ఉద్యోగులు త‌మ ఒక రోజు వేత‌నం రూ 7.5 కోట్ల రూపాయ‌ల‌ను పిఎం కేర్స్ ఫండ్‌కు అందించారు. NTPC యాజ‌మాన్యం ప్ర‌స్తుత పరిణామాలను నిరంత‌రాయంగా నిశితంగా పరిశీలిస్తోంది, తద్వారా కోవిడ్ -19 పై పోరాటంలో దేశం న‌లుమూల‌లా త‌గినంత‌గా విద్యుత్ స‌ర‌ఫ‌రా ఉండేట్టు చూస్తోంది.