ఎన్టీఆర్ అసంతృప్తి—త్రివిక్రమ్ నిర్ణయమే కారణం

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో యంగ్ టైగర్ తన 30 సినిమా ప్రకటించి చాలా రోజులైనప్పటికి దాని చిత్రీకరణ మరింత ఆలస్యం అయ్యేలా కనిపిస్తుంది. లాక్ డౌన్ కారణంగా ఇప్పటికే చిత్రీకరణ పూర్తి అవ్వాల్సిన త్రిబుల్ ఆర్ కాకపోవడం ఒక కారణం అయితే ఈ గ్యాప్ లో విక్టరీ వెంకటేష్ తో సినిమా చేస్తానంటూ త్రివిక్రమ్ అనుకుంటున్నట్లు సమాచారం. ఇదే ఇప్పుడు ఎన్టీఆర్ అసంతృప్తి కి కారణంగా తెలుస్తోంది.

అలా వైకుంఠపురంలో లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత త్రివిక్రమ్ త్రిబుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ ల కాంబినేషన్ కి ఉండే క్రేజ్ వేరుగా ఉంటుందని, అదే వెంకటేష్ తో మూవీ తర్వాత తన మూవీ ఉంటే అంత క్రేజ్ రాదని ఎన్టీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. కానీ త్రిబుల్ ఆర్ పూర్తయియ్యేదెప్పుడు తన సినిమా పట్టాలెక్కేదెప్పుడు అనే మీమాంసలో ఉన్న త్రివిక్రమ్ ఆలోపు ఎప్పుటినుంచో పెండింగ్ లో ఉన్న వెంకటేష్ ప్రాజెక్టు ని పూర్తిచేయాలని భావిస్తున్నారట. చూడాలి ఎన్టీఆర్ పంతం నెగ్గుతుందో, లేదా మాటల మాంత్రికుడి ఆలోచన గెలుస్తుందో. మే 20 చిన్న ఎన్టీఆర్ పుట్టినరోజు నాడు త్రివిక్రమ్ ఎన్టీఆర్ ల కాంబినేషన్ పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.