జపాన్ ఒలింపిక్స్-2020 రద్దు?
ప్రపంచ వ్యాప్తంగా 3.5 లక్షల కేసులు, భారతదేశంలో 360 కేసులు ప్రతి దేశంలో రోజురోజుకు కరోనా కేసుల నమోదు అంతకంతకూ పెరుగుతూ పోతోంది. ఇప్పటి వరకు కరోనా కారణంగా 14657 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ), నిర్వాహణ దేశం జపాన్ పునరాలోచనలో పడింది. ఐఓసీ టోక్యోలో జులై 24న ఒలింపిక్స్ అవకాశాలు సన్నగిల్లుతున్నాయి.
గత నెలలో చైనా నుంచి వచ్చిన ఓడను దేశంలోకి రానివ్వడానికే ఆంక్షలు విధించారు అంతేకాకుండా జయనానీయులకు పరిశుభ్రత-ఆరోగ్యంపై జాగ్రత్తలు
చాలా ఎక్కువగా తీసుకుంటారు. అలాంటిది ఇప్పుడు
కరోనా కాటుకు బలవ్వకుండా క్రీడల నిర్వహణ ఎలా?
ఏమి చేయాలనే విషయంపై జపాన్ ప్రభుత్వానికి, అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీకి కంటిమీద కునుకే
లేకుండా పోయింది. అందుకే షెడ్యూల్ ప్రకారం ఒలింపిక్స్ జరిపేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించిన ఐఓసీ ఇప్పుడు వాయిదా వేసే పునరాలోచనలో పడింది. దాదాపుగా వాయిదా ఖాయమైనప్పటికి అధికారికంగా ఇప్పుడే వెల్లడించడం లేదు.
విశ్వనగరాలే 24/7 లాక్డౌన్ అవుతుండటం ప్రజారవాణా స్తంభించడం, ఐదు మంది కూడా గుమిగూడే పరిస్థితులే
లేకపోవడం, కార్యాలయాలు మూటపడటం, జనమంతా ఇంటికే పరిమితం అవడంలాంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని త్వరలో టోక్యో ఒలింపిక్స్ ‘వాయిదా’ విషయం వెల్లడిస్తారా లేదా చూడాల్సి ఉంది.
భూగోళం కలమానమే స్తంభించింది. ప్రతిష్టంభన ఎన్ని రోజులు ఉంటుందో కూడా తెలియదు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థే కుదేలవుతోంది. సామాన్యులు అన్నామో రామచంద్ర అనే తీవ్రమైన పరిస్థితులు దాపురిస్తున్నాయి. నేలపై మానవుని ఉనికికే ప్రమాదం వచ్చింది. ఇప్పటికి కరోనాకు మందు కూడా కనుగొనలేదు అలాంటిది ఆటలు ఆడటం అవసరమా?
ఈ ప్రశ్నలతో ఐఓసీ ఓ నిర్ణయానికి వచ్చేందుకు సిద్ధమైంది.
కానీ IOC ఆటల నిర్వహణ వ్యవహారం కోట్ల రూపాయలతో ముడిపడి ఉండటం కారణంగా IOC ఆటలు సాగుతాయో
లేదో చూద్దాం. క్రీడల నిర్వహణకు దారులు వెతుకుతున్నప్పటికి క్వాలిఫయింగ్, ప్రాక్టీస్, నిర్వహణ ఏర్పాట్లు, ప్రత్యామ్నాయ అర్హత అవకాశాలకు కూడా నిర్బంధం ఉండటంతో సభ్య దేశాలకు చెందిన క్రీడా సమాఖ్యలు, ఒలింపిక్ సమాఖ్యలు, సంఘాలు, అంతర్జాతీయ క్రీడా పాలక మండలిలతో ఎప్పటికప్పుడు సంప్రదింపుల్లో ‘NO’ వద్దనే సమాధానం వస్తోంది. ఇప్పటికే అంతర్జాతీయ క్రీడల క్యాలెండర్ బిజీబిజీగా ఉండటం, 2021 సమ్మర్ సీజన్ ఏమాత్రం ఖాళీ లేక పోవడం, 2022 ఫుట్‌బాల్ ప్రపంచకప్, బీజింగ్ వింటర్ ఒలింపిక్స్‌లతో ఖరారై ఉన్నాయి. ఆంతే కాదండోయ్ టోక్యోను 40 ఏళ్ల ఒలింపిక్స్ భయాలు ఉక్కిరిబిక్కిరి, రెండో ప్రపంచ యుద్ధం సమయంలో 1940 ఒలింపిక్స్ రద్దు, మాస్కోలో 1980 ఒలింపిక్స్‌ను జపాన్ బహిష్కరణ, ఇప్పుడేమో 2020లో 40 ఏళ్ల తర్వాత జపానే ఆతిథ్యము ఇవ్వడానికి సిద్ధమవుతోన్న సందర్భంలో కరోనా వైరస్ వణుకు కారణంగా జపాన్ ఆందోళనలో పడింది.