కొవిడ్ బారినపడిన ఓం బిర్లా

కొవిడ్ బారినపడిన ఓం బిర్లా

దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి ఇంకా కొనసాగుతోంది. ఇప్పటికే ఎంతోమంది రాజకీయ ప్రముఖులు కరోనా బారినపడగా, తాజాగా లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా కూడా కరోనా బాధితుల జాబితాలో చేరారు. ఆయనకు వైద్య పరీక్షల్లో కరోనా సోకినట్టు వెల్లడైంది. రెండ్రోజుల కిందటే ఆయనకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది.దాంతో ఆయనకు ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. దీనిపై ఎయిమ్స్ వైద్యులు స్పందిస్తూ… ఇప్పుడు ఓం బిర్లా ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని తెలిపారు. ఆయన మార్చి 20న ఎయిమ్స్ లో చేరినట్టు వెల్లడించారు. ఆయన కీలక అవయవాల పనితీరు సాధారణంగానే ఉందని వివరించారు.