భారతంలో కరోనా మృత్యుంజయులు 1K

కరోనా సోకిందంటే ప్రాణాలు పోవడం ఖాయమా? కోవిడ్-19 మహామ్మారి వ్యాప్తిని అరికట్టే మందు ప్రపంచంలోనే లేనప్పుడు మరణమే శరణ్యమా? కరోనా బారినపడి బతికి బట్టలు కట్టినోళ్లు ఉన్నారా? ఉంటే అసలు ఎంతమంది?? ఆ మృత్యుంజయులు ఎలా కరోనా కోరల్లో నుంచి బయటపడ్డారో ఆ వివరాలు మీ కోసం..

మన దేశ కేంద్ర ఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం వివరాల్లోకి వెళ్తే ఏప్రిల్ 13th 2020 వరకు 1096మంది మృత్యుంజయులుగా కరోనా యుద్ధంలో పోరాడి ప్రాణాలు నిలబెట్టురుకున్నారు. ఎలా ఈ కరోనా సోకిన వ్యక్తులు బయటపడ్డారంటే ముందుగా
కరోనా వైరస్ సోకిన వ్యక్తులకు వైద్యుల పర్యవేక్షణలో 14 రోజుల నిర్బంధంలో ఉంచుతున్నారు. ఆరోగ్యంగా ఉండేందుకు రోగ నిరోధ శక్తి కోసం పౌష్టిక ఆహారం అందిస్తారు. ఈ రెండు వారాలు వైద్యులు నిరంతరం కరోనా పేషంట్లను పర్యవేక్షిస్తూ రెండు మూడు సార్లు పరీక్షలు నిర్వహిస్తారు. ఆ తర్వాత పరీక్షల్లో నెగిటివ్ రిపోర్టు వస్తేనే ఒకటికి రెండు సార్లు పరీక్షించి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తారు. ఆ తర్వాత కరోనా మృత్యు కోరల్లో నుంచి బయటపడ్డ వ్యక్తులు హోం క్వారంటైన్ కు వ్యవస్థలోకి తరలిస్తారు.

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ సోకిన వ్యక్తుల్లో ఏప్రిల్ 13th 2020 వరకు 4,28,277 మంది మృత్యుంజయులుగా భూమిపై నూకలున్నాయని నిరూపించుకున్నారు.