ఏరియల్‌ సర్వేలకు ఆన్‌లైన్‌ సౌకర్యం

ఏరియల్‌ సర్వేలు చేపట్టడానికి, రక్షణ మంత్రిత్వ శాఖ జారీ చేసే నిరభ్యంతర పత్రం (ఎన్‌వోసీ‌) పొందేందుకు ప్రత్యేక వెబ్‌ పోర్టల్‌ https://modnoc.ncog.gov.in/login ను రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్‌నాథ్‌సింగ్‌ ప్రారంభించారు. 01.03.2020 నుంచి ఆన్‌లైన్‌ ద్వారా వచ్చిన దరఖాస్తులను మాత్రమే ప్రస్తుతం పరిశీస్తున్నారు. ఇప్పటికే 9 మంది ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. ఏరియల్‌ సర్వే చేపట్టాలన్న ఆసక్తి ఉన్నవారు, నిరభ్యంతర పత్రం కోసం ఈ ఆన్‌లైన్‌ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలని రక్షణ మంత్రిత్వ శాఖ సూచించింది.