ఒక్కటే TV DTH BOX- TRAI నిర్ణయం

టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఓ సరికొత్త ప్రతిపాదనలు ప్రజల ముందుకు తీసుకు వచ్చింది. టీవీ వీక్షణలకు వినియోగించే DTH, కేబుల్ సెట్ టాప్ బాక్స్‌ లన్నింటిలో ఇక నుంచి ఓ వ్యవస్థలో నుంచి మరో సంస్థకు మారే సమయంలో ఒక్కటే DTH బాక్స్ విధానం అమలులో ఉండేలా అవకాశం కల్పించింది. మొబైల్ నెట్ వర్క్ ఎలాగైతే మార్పులు చేసుకుంటునమో అలాగే అన్ని కంపెనీలు ఒక్కటే బాక్సు వాడే వ్యవస్థను వినియోగదార్లకు అందుబాటులో ఉండేలా నిబంధనలు తప్పనిసరి చేయాలని సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖను TRAI కోరింది. భవిష్యత్ లో DTH కంపెనీ
బాక్స్ మార్చే అవకాశం ఉండకుండా సేవలు అందుబాటులోకి రానున్నాయి. అలాగే డిజిటల్ టెలివిజన్ సెట్ల కోసం యూఎస్‌బీ పోర్టు ఆధారిత సాధారణ ఇంటర్‌పేస్‌ను తప్పనిసరి చేయాలని TRAI ప్రతిపాదించింది.