NRIs రవాణాకు “ఆపరేషన్ సముద్ర సేతు”

భారతీయ పౌరులను విదేశాల నుండి స్వదేశానికి రప్పించే జాతీయ ప్రయత్నంలో భాగంగా ఆపరేషన్ సముద్ర సేతు అంటే సముద్ర బ్రిడ్జ్’ ప్రారంభమైంది. నావికాదళ నౌకలు జలాష్వా , మాగర్ ప్రస్తుతం మాల్దీవ్‌లోని మాలే నౌకాశ్రయంలో ఉన్నాయి. ఫేస్-1 మే8 నుండి కార్యకలాపాలను ప్రారంభిస్తారని ఇండియన్ నేవీ ప్రకటించింది. కరోనా మహామ్మారి కారణంగా ఇతర దేశాల్లో ఇరుక్కున్న భారతీయులు లాగే NRIలు అందరికి ఈ ప్రయాణ సౌలభ్యం అందుబాటులోకి రాబోతోంది. కరోనా కాలంలో భారతీయులకు త్రివిధ దళాలు అండగా నిలబడటంతో అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.