ఓయూ పరీక్షల ఫలితాలు విడుదల

ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూ పరిధిలోని వివిధ డిగ్రీ, పీజీ కోర్సుల పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్‌ ఆఫ్‌ ది ఎగ్జామినేషన్స్‌ ప్రొఫెసర్‌ శ్రీరాం వెంకటేశ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. బీఏ, బీకాం, బీబీఏ, బీఎస్సీ, బీఎస్‌డబ్ల్యూ తదితర కోర్సుల మొదటి, మూడో, అయిదో సెమిస్టర్‌ రెగ్యులర్‌ పరీక్షల రివాల్యుయేషన్‌ ఫలితాలను ఓయూ వెబ్‌సైట్‌ www.osmania.ac.in లో ఉంచినట్లు చెప్పారు.