ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న‌ ఆక్సిజ‌న్ కాన్స‌న్‌ట్రేట‌ర్లు

ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న‌ ఆక్సిజ‌న్ కాన్స‌న్‌ట్రేట‌ర్లు

భార‌త్‌లో క‌రోనా ఉగ్ర‌రూపం దాల్చిన వేళ వైద్య ప‌రిక‌రాలు సాయం చేస్తామ‌ని ప్ర‌క‌టించిన అమెరికా ఇచ్చిన మాటను నిల‌బెట్టుకుంది. భార‌త్‌కు ఆక్సిజ‌న్ కాన్స‌న్‌ట్రేటర్స్‌ను పంపింది. ఆక్సిజ‌న్ అవ‌స‌రం ఉన్న రోగుల కోసం ఉప‌యోగించే ఈ ప‌రికరాల‌ను అమెరికా ప్ర‌భుత్వం నిన్న న్యూయార్క్‌లోని జేఎఫ్‌కే ఎయిర్ పోర్టు నుంచి ఎయిర్ ఇండియా ద్వారా ఢిల్లీకి పంపింది. ఈ రోజు ఈ ప‌రిక‌రాలు ఢిల్లీ ఎయిర్‌పోర్టుకి చేరుకున్నాయి. మొత్తం 318 ప‌రిక‌రాల‌ను భార‌త్‌కు అమెరికా పంపింది. వాటిని విమానం నుంచి సంబంధిత సిబ్బంది దించి, అవ‌స‌రం ఉన్న‌ ఆసుప‌త్రుల‌కు త‌ర‌లిస్తున్నారు.