కరోనా కట్టడిలో పంచాయితీల పాత్ర

కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తి నిరోధానికి దేశవ్యాప్తంగా రాష్ట్ర, జిల్లా, పంచాయతీ స్థాయిలలోని స్థానిక పాలనా యంత్రాంగాలు వివిధ కార్యక్రమాలను కొనసాగిస్తున్నాయి. లాక్ డౌన్ పరిస్థితులు ఉల్లంఘన జరగకుండా, సామాజిక దూరం నిబంధనలను కఠినంగా అమలయ్యేలా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు, జిల్లా అధికారులు, గ్రామ పంచాయతీలతో సన్నిహిత సమన్వయంతో పనిచేస్తోంది. వివిధ కార్యక్రమాల విషయంలో ఇతరులు అనుసరించే ఉత్తమ చర్యలు –ఆంధ్ర ప్రదేశ్: వివిధ ప్రాంతాల్లో ఉండిపోయిన వలస కార్మికుల సహాయార్థం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కంట్రోల్ రూం ఏర్పాటు చేసింది. ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన ఆంధ్ర ప్రజలు 0866-2424680 కు కాల్ చేయవచ్చు అలాగే ’ఆంధ్రాలో చిక్కుకున్న ఇతర రాష్ట్రాల ప్రజలు 1902 కు కాల్ చేసి వారి వివరాలను ఇవ్వవచ్చు, వారి ప్రదేశాలకు వెళ్ళడానికి సహాయం పొందవచ్చు. అదేవిధంగా, గ్రీన్ జోన్లో ఉన్న 1655 పరిశ్రమలకు అనుమతులు ఇవ్వబడ్డాయి. అవి కార్యకలాపాలు ప్రారంభించాయి. వలస కార్మికులు ఒక గ్రీన్ జోన్ నుండి మరొక గ్రీన్ జోన్ కి వెళ్లి తగిన జాగ్రత్తలతో పనిచేయడానికి అనుమతి ఉంది.

అస్సాం: కాచర్ జిల్లాలోని సిల్చార్ బ్లాక్, తారాపూర్ గ్రామ పంచాయతీలో 17 మంది సభ్యులతో కూడిన 5 స్వయం సహాయక సంఘాలు మాస్కులు ఉత్పత్తి చేస్తున్నాయి.కేరళ : కోవిడ్-19 వ్యాప్తి నుండి ఇతర దేశాలు రాష్ట్రాల నుండి జిల్లాకు వచ్చిన ప్రజలతో కలిసిన వారిని గుర్తించదానికి 40 మంది NSS వాలంటీర్లు కలెక్టరేట్ ప్రాంగణంలోని జిల్లా వైద్య కార్యాలయంలో పని చేస్తున్నారు. కంట్రోల్ సెల్ దిగ్బంధంలో ఉన్నవారిని, ఇతర రాష్ట్రాల నుండి వస్తువులను రవాణా చేస్తున్న లారీ డ్రైవర్లను, ప్రత్యేక పాస్ తో సరిహద్దులు దాటిన వారిని పర్యవేక్షిస్తుంది. వారి ప్రయాణ మార్గాలు మరియు సంప్రదింపు వ్యక్తులను గుర్తిస్తున్నారు. సెల్ వద్ద భద్రతా చర్యలను చేపట్టినప్పుడు వాలంటీర్లు మాస్కులు ధరిస్తారు, శానిటైజర్లను ఉపయోగిస్తారు. వీరంతా తమ ఇళ్లలోకి ప్రవేశించే ముందు తమను తాము శానిటైజ్ చేసుకుని, ఫోన్‌లను శుభ్రపరుచుకుంటారు. రోజు పని తర్వాత, యథాతదంగా తమ చదువులు కొనసాగించడానికి ఆన్‌లైన్ తరగతులకు హాజరవుతారు.

తెలంగాణ: కోవిడ్-19 రోగులు, అనుమానితుల చికిత్స ప్రదేశాల నుండి బయో-మెడికల్ వ్యర్థ పదార్థాల నిర్వహణ విషయంలో ప్రత్యేక నిబంధనలు, మార్గదర్శకాలను అనుసరించాలని తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (టిఎస్పిసిబి) ప్రజలను, పాలనా యంత్రాంగాలను విజ్ఞప్తి చేసింది.

రామగుండం జాతీయ థర్మల్ విద్యుత్ కేంద్రం లేడీస్ క్లబ్, దీప్తి మహిళా సమితి అక్కడ ఉద్యోగులు, కాంట్రాక్టు పని వారికి 5,000 కాటన్ మాస్కులను పంపిణీ చేశాయి. ఈ మాస్కులను లేడీస్ క్లబ్ సభ్యులతో పాటు, చుట్టుపక్కల ఉన్న గ్రామాలలోని మహిళలు వీటిని తయారు చేయడం విశేషం.

మిజోరాం: మిజోరాం గ్రామీణ ప్రాంత ప్రజలు ఎక్కువగా వ్యవసాయ పనులు, లేబర్ పనులపైనే ఆధార పడి ఉంటారు. ప్రస్తుత పరిస్థితిలో వారి రోజు వారి జీవనం ఇబ్బందికరంగా మారడం, ఆర్జన లేకపోవడంతో స్థానిక సంస్థలు వారికి తగు ఆహార పదార్థాలు అందించేలా చర్యలు తీసుకున్నాయి. ప్రభుత్వం వారికి ఉచిత రేషన్ అందజేస్తోంది. వారి వ్యవసాయ భూముల్లో, సామజిక దూరం పాటిస్తూ, పని చేసుకోడానికి స్థానిక సంస్థలు కొన్ని నిబంధనలతో అనుమతినిచ్చాయి. పండించిన వ్యవసాయ ఉత్పత్తులు సేకరించి రాష్ట్ర రాజధానిలో అమ్ముకోడానికి తగిన ఏర్పాట్లు చేశారు.