పార్లమెంట్ నిరవధిక వాయిదా

పార్లమెంట్ నిరవధిక వాయిదా

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు నిరవధికంగా వాయిదా వేసారు. ఉభయ సభల్లో చర్చ లేకుండానే ఆర్థిక బిల్లును ఆమోదం తెలిపారు. ఇంకా 12 రోజులు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరగాల్సి ఉండగా కరోనా వైరస్ ప్రభావంతో ఆర్థిక బిల్లు ద్రవ్య బిల్లు కావడంతోఆమోదం తర్వాత నిరవధిక వాయిదా వేసారు. దేశంలో అసాధారణ పరిస్థితుల కారణంగా ఎలాంటి చర్చ లేకుండా బిల్లు ఆమోదానికి అంగీకారం తెలిపాల్సి వచ్చిందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. సోమవారం రాత్రి వరకు భారత్‌లో 433మందికి కరోనా వైరస్ సోకింది, 7మంది ప్రాణాలు బలి తీసుకుంది.