పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాలు 2020

పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాలు 2020

సోమవారం ఉదయం 11 గంటల నుంచి పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభల్లో వాడివేడిగా చర్చలు జరగనున్నాయి. నేటి నుంచి ఏప్రిల్ 3న ముగియనున్న ఈ సమావేశాల్లో దాదాపు 45 బిల్లులు, 7 ఆర్థిక పద్దులను ప్రవేశపెట్టాలి అలాగే ఆమోదానికి ప్రయత్నాలు కేంద్రం చేయనుంది. ఢిల్లీలో హింసాత్మక ఘటనలు చెలరేగిన నేపథ్యంలో నరేంద్ర మోదీ సర్కారుని ఇరుకున పెట్టేందుకు కాంగ్రెస్ సహా ఇతర ప్రతి పక్ష పార్టీలు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాయి.

తొలి రోజు జరిగిన సంఘటన ఫోటోలు.