పార్లమెంటులో కరోనా కట్టడికి థర్మల్ స్క్రీనింగ్

పార్లమెంటులో థర్మల్ స్క్రీనింగ్

పార్లమెంట్ ఆవరణలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. బడ్జెట్-2020 రెండో విడత సమావేశాలు కొనసాగుతోన్న సందర్భంగా పార్లమెంట్ హౌస్‌లో థర్మల్ స్క్రీనింగ్
తనిఖీలు చేపట్టడం జరుగుతోంది. సాధారణ ప్రజలు, లోక్ సభ మరియు రాజ్యసభ సభ్యులు అందరు కూడా పార్లమెంట్ భవనంలోకి వెళ్లే ముందు ఈ థర్మల్ స్క్రీనింగ్ చేసిన తర్వాత లోపలికి అనుమతి ఇస్తున్నారు. అంతే కాకుండా పార్లమెంట్ ఆవరణలో మాస్కులు ధరించి MPs సమావేశాలకు హాజరవుతున్నారు.