కొడంగల్ నియోజకవర్గ పరిధిలో నిత్యావసరాల పంపిణీ

మహబూబ్ నగర్ జిల్లా కొడంగల్ నియోజకవర్గ పరిధిలోని బొంరస్ పెట్, దౌలతాబాద్, మద్దూరు, కోడంగల్, మండలాల్లో, కోడింగ్, కోస్గి, మున్సిపాలిటీలలో MLA పట్నం నరేందర్ రెడ్డి పర్యటన చేసారు.

500 మంది ఆశ వర్కర్లకు, మున్సిపల్ పారిశుద్ధ్య వర్కర్లకు, ఆటో డ్రైవర్లు, జర్నలిస్టులకు,అంగన్ వాడీ వర్కర్లకు నిత్యావసర సరుకుల పంపిణీ చేశారు పట్నం నరేందర్ రెడ్డి. కరోనా వైరస్ మహమ్మారి నివారణకు సీఎం కేసీఆర్ నిర్దేశించిన విధంగా అలుపెరుగని పోరాటం చేద్దాం. వైద్యులు, పోలీసులు, పారిశుధ్యం కార్మికులు, రెవెన్యూ సిబ్బంది, ఆశా వర్కర్ల కు అందరం రుణపడుదాం. మే నెల 7 వరకు లాక్ డౌన్ నిబంధనలు తప్పక పాటించాలి.

ప్రభుత్వం రేషన్ కార్డు ఉన్న ప్రతీ ఒక్కరికీ 12 కేజీల బియ్యం, రూ.1500 అందరూ సద్వినియోగం చేసుకోవాలి. రాష్ట్రంలో వలస కూలీలతో సహా ఎవ్వరూ ఆకలికి అలమటించం కుండా మానవమూర్తులు అధికారులతో కలిసి సహకారం, సహాయం అందించాలి. ఉపాధి హామీ, రైతులకు పొలం పనులకు అనుమతులున్నా సామాజిక దూరం వ్యక్తిగత దూరం పాటించండి.