పవన్ కళ్యాణ్ సైనిక సంక్షేమ నిధికి కోటి విరాళం

ఢిల్లీలోని ఆర్.కె.పురం కేంద్రీయ సైనిక్ బోర్డు అధికారులతో పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. సైనిక అధికారుల సంక్షేమ నిధికి కోటి రూపాయలు చెక్కు పవన్ కళ్యాణ్ అందజేశారు. సైనిక్ బోర్డు కి సహాయం అందించాలంటూ
బ్రిగేడర్ వీరేంద్ర కుమార్ లేఖ నన్ను కదిలించింది.
నా వంతు సహాయంగా కోటి రూపాయలు అందించాలని భావించాను. గత ఢిల్లీ పర్యటన్లోనే ఇవ్వాలని అనుకున్నప్పటికి కూదరలేదు. దేశాన్ని, సైనికులను ప్రేమించే ప్రతి ఒక్కరు సైనిక్ బోర్డ్ కి సహాయం చేస్తే సైనిక కుటుంబాలకు ఎంతో కొంత ఉపయోగపడుతుంది. మధ్యాహ్నం విజ్ఞాన్ భవన్ లో జరిగే
యూత్ పార్లమెంట్ సదస్సులో పవన్ కళ్యాణ్ పాల్గోన్నారు.