లావణ్య త్రిపాఠిని బుక్ చేసిన పవన్ కళ్యాణ్

లావణ్య త్రిపాఠిని బుక్ చేసిన పవన్ కళ్యాణ్

తెలుగు చిత్ర పరిశ్రమలో సొట్ట బుగ్గల సుందరిగా పేరుగాంచిన హీరోయిన్లలో లావణ్య త్రిపాఠి ఒకరు. తెలుగు వెండితెరకు ‘అందాల రాక్షసి ‘అనే చిత్రం ద్వారా 2012లో పరిచయమైంది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించింది.

ముఖ్యంగా, టాలీవుడ్ “మన్మథుడు” ‘సోగ్గాడే చిన్నినాయన’ చిత్రంలో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. పైగా, నాగార్జునతో సాగించిన రొమాన్స్ సన్నివేశాల్లో అదిరిపోయాలా నటించింది. ఆ తర్వాత ఈమెకు పెద్ద సినీ అవకాశాలు రాలేదు. దీంతో తెరమరుగైంది. ఈ క్రమంలో ఇపుడ ఈ సొట్టబుగ్గల సుందరికి బిగ్ ఆఫర్ వరించింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించే తాజా చిత్రం ‘వకీల్ సాబ్’. ఈ చిత్రంలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లో ప‌వ‌న్‌ క‌ల్యాణ్ స‌ర‌స‌న శృతిహాస‌న్ న‌టిస్తుంద‌ని.. కాదు ఇలియానా న‌టిస్తుందంటూ సోష‌ల్ మీడియాలో వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.

తాజాగా ఈ లిస్టులో ‘అందాల రాక్షసి’ పేరు చేరింది. ఇది నిజ‌మైతే ప్ర‌స్తుతం సందీప్ కిష‌న్ ‘ఏ1 ఎక్స్‌ప్రెస్ త‌ప్ప పెద్ద‌గా అవ‌కాశాలు లేని లావ‌ణ్య‌ త్రిపాఠికి మంచి అవ‌కాశ‌మ‌నే చెప్పాలి. మ‌రి సోష‌ల్ మీడియాలో వ‌స్తున్న ఈ వార్త‌ల‌పై చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి. శ్రీరామ్ వేణు ద‌ర్శ‌క‌త్వంలో బోనీక‌పూర్‌, దిల్‌రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మే 15న సినిమా విడుద‌ల కానుంది.