వ‌కీల్‌సాబ్‌తో ప‌వ‌న్ రీ ఎంట్రీ

వ‌కీల్‌సాబ్‌తో ప‌వ‌న్ రీ ఎంట్రీ..!
సినిమా షూటింగ్‌లో బిజిబిజీగా ప‌వ‌న్‌
ఎంతో ఆతృత‌గా ఎదురు చూస్తున్న ప‌వ‌న్ అభిమానులు

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..ఈ పేరు వింటేనే యూత్‌కు అదో స్టైల్‌. అజ్ఙాత‌వాసి, కాట‌మ‌రాయుడు, అత్తారింటికి దారేది, గ‌బ్బ‌ర్ సింగ్‌, ఖుషి, తొలిప్రేమ‌, జల్సా, త‌మ్ముడు లాంటి సినిమాల‌తో యువ‌త ప్ర‌త్యేక‌మైన చోటు సంపాదించుకున్నారు. అయితే రాజకీయాల్లో అవినీతిని ఏకీపారేస్తాన‌ని..రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇవ్వ‌డం, కొంత కాలం పాటు సినిమాల‌కు దూర‌మ‌య్యారు. అయితే మ‌ళ్లీ రీ ఎంట్రీ ఇస్తుండ‌టంతో ప‌వ‌న్ అభిమానుల‌కు వ‌కీల్ సాబ్ పేరుతో తెర‌పై త‌న స్టైల్‌ను చూపించ‌నున్నారు. దీని కోసం ఎంతో ఆతృత‌గా ప‌వ‌న్ అభిమానులు ఎదురు చూస్తుండ‌టం గ‌మ‌నార్హం.

సీరియ‌స్ గా సినిమా షూటింగ్‌ల్లో ప‌వ‌న్ బిజిబిజీ..!
– పవన్ కళ్యాణ్ రెండు పడవల పయనం తెలిసిందే. రాజకీయాలకు అనుకూల కాల్షీట్ కేటాయించి.. సైలెంట్ గా సినిమాలపై పడ్డారు. ఒకప్పుడు పవన్ షూటింగ్ కి ఎప్పుడు వస్తాడో తెలియని పరిస్థితి ఉండేది. దర్శక నిర్మాతలు ఆయన ఏ రోజు షూటింగ్ కి వస్తాడో అని కళ్లు కాయలు కాచేలా ఎదురు చూసేవారన్న కామెంట్లు వినిపించేవి. కానీ రాజకీయాల్లోకి వెళ్లొచ్చాక కాస్త జ్ఞానోదయం కలిగి.. ఈసారి చాలా సీరియస్ గా సినిమా షూటింగుల్లో పాల్గొంటున్నాడన్న గుసగుసా వినిపిస్తోంది. బ్యాక్ టు బ్యాక్ ఏకంగా మూడు సినిమాలను లైన్ లో పెట్టాడు. ఇప్పటికే రెండు సినిమాలు చిత్రీకరణలో ఉన్నాయి. తాజాగా తన 26వ చిత్రంగా `వకీల్ సాబ్` శరవేగగా పూర్తవుతోంది. వేణు శ్రీరామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. బోనీ కపూర్ సమర్పణలో దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సినిమా చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. ఈ నెల 21 నుంచి ఫైనల్ షెడ్యూల్ జరుగుతుందట. ఇందులో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ చిత్రీకరించబోతున్నట్టు తెలుస్తుంది.

ప‌వ‌న్ జోడిగా ఇల్లీ బేబీ..!:
– అలాగే ఈ చిత్రానికి పవన్ మార్క్ కమర్షియల్ అంశాల మేళవింపుగా తెరకెక్కిస్తున్నారన్న సమాచారం ఇప్పటికే వెల్లడించారు. అందుకోసం భామల్ని బరిలో దించేస్తున్నారట. పవన్ కి జోడిగా ఓ కథానాయికగా కూడా ఉంటుంది. అందులో భాగంగా గోవా బ్యూటీ ఇలియానా పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. తన ఫ్యాన్స్ ని హీటెక్కించే రొమాన్స్ తో సంతృప్తి పరచాలంటే ఇల్లీ బేబీ తనకి జోడి ఉండాలని పవన్ భావించారట. దీంతో ఇల్లీని హీరోయిన్ గా తీసుకోవాలనుకుంటున్నారట.

మ‌రో బామ శృతిహాస‌న్ పేరు ప‌రిశీల‌న‌..!:
-ఇక ఇల్లీ బేబీతో పాటు గబ్బర్ సింగ్ నాయిక శృతి హాసన్ పేరును పరిశీలిస్తున్నారట. మరి ఇద్దరిలో ఎవరిని తీసుకుంటారనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. ఇలియానా పవన్ తో గతంలో ‘జల్సా’ చిత్రంలో నటించిన విషయం విదితమే. ఇక శృతి హాసన్ `గబ్బర్ సింగ్` – `కాటమరాయుడు` చిత్రాల్లో రొమాన్స్ చేసింది. త్వరలో ప్రారంభం కాబోయే హరీశ్ శంకర్ చిత్రంలోనూ పవన్ సరసన శృతినే తీసుకోబోతున్నట్టు సమాచారం. `వకీల్ సాబ్`తోపాటు క్రిష్ దర్శకత్వంలో రూపొందే చిత్రం కూడా షూటింగ్ జరుపుకుంటోంది. అలాగే `గబ్బర్ సింగ్` తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందే సినిమా త్వరలో ప్రారంభం కానుంది.