పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ ఐతే నేనేమో డైరెక్టర్ సాబ్ నంటోన్న రాం గోపాల్ వర్మ.

పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ ఐతే నేనేమో డైరెక్టర్ సాబ్ నంటోన్న రాం గోపాల్ వర్మ.

నన్ను మించిన డైరెక్టర్ లేడనుకున్నారంటే మీ కర్మ…నా కొంచెం తిక్కుంది దానికో లెక్కుంది ఈ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించో మీకిప్పటికే అర్థమై ఉంటుంది. వారెవ్వారంటారా అదేనండీ
రాం గోపాల్ వర్మ మరియు పవన్ కళ్యాణ్. టాలీవుడ్ పవర్ స్టార్ పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత తొలిసారిగా దిల్ రాజు, బోనీ కపూర్ నిర్మాణంలో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ‘వకీల్ సాబ్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే ఈ సినిమా ఫస్ట్ లుక్‌పై అభిమానులు సానుకూలంగా స్పందించారు.

నలుగురు నడిచే దారిలో కాకుండా రొటీన్ కు భిన్నంగా స్పందించే రాం గోపాల్ వర్మ వపన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా లుక్‌పై కామెంట్లు విసిరారు. పవన్ వకీల్ సాబ్‌ ఐతే నేనేమో డైరెక్టర్ సాబ్ అంటూ ఓ పోస్టర్‌ను రిలీజ్ చేసి తన మేనరిజంను చాటుకున్నాడు.