కేంద్ర అధినాయకత్వం ఆయనకు అనుకున్నంత ప్రియారిటీ ఇవ్వలేదు
బీజేపీ జనసేనల కలయిక పవన్ కల్యాణ్ స్థాయిని తగ్గించి పవన్ కల్యాణ్‌ను ఒక రకంగా అవమానించినట్టే లెక్క.
– ఎందుకంటే పవన్ వెళ్లి జేపీ నడ్డాను కలిశారు. అమిత్‌షా కలవలేదు. మోదీ కలవలేదు. అమిత్‌షాతో కనీసం ఒక మాట కూడా చెప్పించలేకపోయారు.
– పోనీ అమిత్‌షా స్థాయి పెద్దది.. కేంద్ర హోం మంత్రి అనుకుంటే .. కనీసం జేపీ నడ్డా, పవన్ కూడా ప్రెస్కాన్ఫరెన్స్ పెట్టలేదు.
– సుజనా చౌదరి, సీఎం రమేశ్ తదితర ఎంపీలు జేపీ నడ్డాను కలిసినప్పుడు ఆ నలుగురిని స్వయానా జేపీ నడ్డా తీసుకెళ్లి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో కలిపించి తరువాత నేరుగా అందరూ కలిసి బీజేపీ అఖిల భారత కార్యాలయానికి వెళ్లి అక్కడ జేపీ నడ్డా , సుజనా చౌదరి అందరూ కలిసి ప్రెస్ కాన్ఫరెన్స్ అటెండ్ చేశారు. సుజనా చౌదరి పొలిటికల్‌గా తన స్థాయిని నిలుపుకోగలిగారు.
– సుజనాతో పవన్‌ని పోల్చితే.. పవన్ చాలా పెద్ద నాయకుడు. రాష్ట్రంలో జగన్ తరువాత జనాకర్షన కలిగిన నాయకుడు. ఓట్లు రావొచ్చు రాకపోవచ్చు, సీట్టు రావొచ్చు రాకపోవచ్చు అది వేరే సంగతి. కానీ సుజనా కంటే అంతో ఇంతో జనాకర్షన కలిగిన నాయకుడు.
– అంతటి స్థాయి ఉన్న వ్యక్తితో జేపీ నడ్డా దిల్లీలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టొచ్చు కదా? బీజేపీ వాళ్లు తెలివిగా పవన్‌ను సైడ్ చేశారు. మోదీ కలవలేదు. జేపీ నడ్డాతో కలిశాడు. అక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ లేదు.
-విజయవాడ వెళ్లు అక్కడ మా వాళ్లతో కలిసి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టుకో అన్నారు. వచ్చి కన్నాలక్ష్మీ నారాయణ, సునీల్ దేవధర్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు.
– తెలివిగా బీజేపీ ఏం చేసిందంటే మేం చెప్పినట్లు వినాల్సిందే అని పవన్‌కు స్పష్టం చేసినట్లే కదా?
– రాష్ట్రంలో గత ఎన్నికల్లో బీజేపీకి కేవలం 1 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. జనసేనకు బీజేపీ కంటే కనీసం 400 శాతం ఓట్లు ఎక్కువ వచ్చాయి. అయినా బీజేపీ చెప్పినట్లు ఎందుకు వింటున్నాడు.
– పొలిటికల్ బార్గెయిన్లో కూడా పవన్ ఫెయిల్ అయ్యాడు.
కమ్యునిస్టులకు పవన్ బాకీ లేడు. పవన్‌కు కూడా కమ్యునిస్టులు బాకీలేరు. ఇప్పుడు బీజేపీతో కలుస్తున్నావ్ కదా.. ఆంధ్రప్రదేశ్‌కు బీజేపీ కొన్నివిషయాల్లో బాకీ ఉంది. దాంట్లో 1. ప్రత్యేక హోదా 2. విభజన హామీలు కొన్ని బాకీ ఉన్నాయ్. 3. కడప స్టీల్ ప్లాంట్ కట్టలేదు. విశాఖ రైల్వే జోన్ ఆదాయం లేకుండా ఇచ్చారు. దుగ్గరాజపట్నం పోర్టు రాలేదు. పెట్రోలియం రిఫైనరీ యూనిట్ రాలేదు. ఇవన్నీ ఆంధ్రప్రదేశ్‌కు బీజేపీ బాకీ ఉన్నట్లేకదా?బీజేపీ బాకీ ఉన్నపుడు మిత్రుడు కూడా బాకీ కట్టాలి కదా? నువ్వు ఒకరితొ కలుస్తున్నప్పుడు వాళ్లు బాకీ ఉంటే నువ్వు బాకీ ఉన్నట్లే కదా? కమ్యునిస్టులతో బాకీ కాదు? ఆంధ్రప్రదేశ్ ప్రజలతో బాకీ.