రసాయన ప్రమాదంతో విశాఖలో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు

APలోని విశాఖపట్టణం జిల్లాలో భారీ రసాయన ప్రమాదం జరిగింది. జిల్లాలోని గోపాలపట్నం పరిధి RR వెంకటాపురంలో ఉన్న ఓ పాలిమర్స్‌ పరిశ్రమ నుంచి ప్రమాదకరమైన రసాయన వాయువు లీకైంది. దీంతో రసాయన వాయువు లీకేజీని అరికట్టేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అలాగే విశాఖలో ఈ పరిశ్రమలో గ్యాస్‌ లీకైన ఘటనపై ముఖ్యమంత్రి ఆరా తీసారు. తక్షణమే తగు సహాయ కార్యక్రమాలు చేపట్టాలని సీఎం ఆదేశాలు జారీ చేసారు. బాధిత ప్రాంతాల్లో తగిన చర్యలు వెంటనే తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌కు సూచించారు. ప్రస్తుతం అందుతోన్న సమాచారం ప్రకారం ఈ రసాయన వాయువు 3 కిలోమీటర్ల మేర వ్యాపించడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శరీరంపై దద్దుర్లు, కళ్లలో మంటలు, శ్వాసకోస సమస్యలతో ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి.