చిరుతపులిని చూసి జనం పరుగులెత్తారు…

హంద్వారాలోని లాంగేట్ నివాస ప్రాంతంలోకి ప్రవేశించిన చిరుతపులి దాడిలో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసు మరియు వన్యప్రాణి విభాగం సంఘటన స్థలానికి చేరుకుని చిరుతపులిని పట్టుకునే ప్రయత్నాలు జరిగాయి. అడవుల్లో ప్రశాంతంగా విహరించాల్సిన పులులు అప్పుడప్పుడు ఇలా జన జీవనంలోకి వస్తుండటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.